Belly Fat:పరగడుపున ఈ డ్రింక్ తాగితే పొట్టలో కొవ్వు కరిగి నాజుగ్గా మారతారు
Belly Fat Drink In Telugu: మన వంటింట్లో ఎన్నో సుగంధ ద్రవ్యాలు ఉంటాయి. వాటిలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే వాటిలో ఉన్న ప్రయోజనాలు గురించి తెలియక మనం పెద్దగా పట్టించుకోము. అయితే ఇప్పుడు చెప్పే ఈ టీ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా పరగడుపున తాగితే అధిక బరువు సమస్య తగ్గటమే కాకుండా రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది.
దాల్చిన చెక్క టీని పరగడుపున తాగటం వలన అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. జీవ క్రియను సరిగ్గా చేస్తుంది. దాల్చిన చెక్కలోని యాంటీ ఆక్సిడెంట్స్ పొట్టకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తాయి. ఉదయం సమయంలో ఈ టీ తాగడం వలన పొట్ట శుభ్రపడుతుంది.
గ్యాస్,ఎసిడిటి,కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారికి కూడా చాలా మంచిది. రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. ప్రతి రోజు ఉదయం తాగటం వలన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉండటం వలన చర్మానికి మేలు చేస్తుంది. మొటిమల సమస్యలు తగ్గుతాయి.
కాబట్టి ప్రతిరోజు ఉదయం సమయంలో పరగడుపున దాల్చిన చెక్క టీ తాగటానికి ప్రయత్నం చేయండి. అయితే దాల్చిన ఒకటి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి అంగుళం దాల్చిన చెక్క ముక్క లేదంటే పావు స్పూన్ లో సగం దాల్చిన చెక్క పొడి వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించి ఆ నీటిని వడగట్టి తాగాలి.
రుచి కోసం అవసరం అనుకుంటే నిమ్మరసం, తేనె కలుపుకొని తాగవచ్చు. అయితే డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తీసుకోవాలి. ఈ విధంగా ప్రతిరోజు తీసుకోవటం వలన బరువు తగ్గడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. శరీరంలో వ్యర్ధాలు అన్ని తొలగిపోతాయి. కాబట్టి ఈ డ్రింక్ ని తాగటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News