Kitchen Tips:ప్రతి ఇల్లాలికి ఉపయోగపడే సులభమైన అద్భుతమైన వంటింటి చిట్కాలు
Telugu useful Kitchen Tips: వంటింటిలో కొన్ని చిట్కాలు పాటిస్తే వంట చాలా సులువుగా అవ్వటమే కాకుండా సమయం కూడా ఆదా అవుతుంది. వంటలలో కొన్ని చిట్కాలను పాటిస్తే వంట చాలా రుచిగా ఉంటుంది. ఆ చిట్కాలను తెలుసుకుందాం.
ఈ సీజన్ లో మసాలాలు తొందరగా పాడవుతాయి. మసాలా పొడిలో తేమ చేరి అచ్చులుగా ఏర్పడతాయి. ఇలా ఏర్పడకుండా మసాలా పొడిలో కొంచెం రాళ్ల ఉప్పును వేయాలి. ఇలా రాళ్ల ఉప్పును వేయటం వలన రాళ్ల ఉప్పులో ఉండే సోడియం క్లోరైడ్ తేమని గ్రహిస్తుంది.
బంగాళదుంప, ఉల్లిపాయలను కలిపి నిల్వ చేయాలి. ఈ రెండూ కలిపి నిల్వ చేయటం వలన వాయువులు విడుదల అయ్యి తొందరగా చెడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి బంగాళదుంప, ఉల్లిపాయలను విడి విడిగానే నిల్వ చేయాలి. ఇలా చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
పచ్చిమిర్చి ఎరుపు రంగులోకి మారకుండా ఉండాలంటే పచ్చిమిర్చిలో పసుపు వేసి కలిపి నిల్వ చేయాలి. అప్పుడు పచ్చిమిర్చి ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి.
పెరుగు పుల్లగా మారకుండా ఉండాలంటే చిన్న కొబ్బరి ముక్క వేస్తె సరిపోతుంది.
దోసెల పిండిలో ఒక కప్పు సగ్గుబియ్యం కూడా వేసి రుబ్బితే దోసెలు విరగకుండా బాగా వస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News