Healthhealth tips in telugu

Ice Cream: రాత్రి భోజనం చేసిన వెంటనే ఐస్‌క్రీమ్‌ తింటున్నారా..! ఈ గుడ్ న్యూస్ మీకోసమే

Ice Cream Health benefits : ఐస్ క్రీమ్ అంటే వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు  ఇష్టపడతారు. అయితే Ice  Cream తింటే మంచిది కాదని…ఎక్కువగా తింటే సమస్యలు వస్తాయని తినటానికి కాస్త ఆలోచిస్తారు. కానీ లిమిట్ గా తింటే కలిగే ప్రయోజనాలు చూసి చాలా ఆశ్చర్యపోతారు. కానీ ఐస్ క్రీమ్ తింటే బరువు పెరుగుతారని చాలా మంది భయపడతారు. అలాగే పిల్లలను కూడా ఐస్‌క్రీమ్‌ జోలికి వెళ్లవద్దని వారి తల్లులు చెప్పుతూ ఉంటారు. ఎందుకంటే జలుబు చేస్తుందని, దంతాలు పుచ్చిపోతాయని భయం. అయితే ఐస్ క్రీమ్ తినటం వలన కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి.
Joint pains in telugu
అయితే లిమిట్ గా తీసుకుంటేనే ఆ ప్రయోజనాలు పొందవచ్చు. ఐస్ క్రీంలో విటమిన్ ఎ, బి -6, బి -12, సి, డి, మరియు ఇ, విటమిన్ కె, నియాసిన్,థియామిన్ మరియు రిబోఫ్లేవిన్ సమృద్ధిగా ఉంటాయి. ఐస్ క్రీమ్ ని పాలతో తయారుచేస్తారు. కాబట్టి calcium ఎక్కువగా ఉంటుంది. ఈ calcium ఎముకలను బలంగా,ఆరోగ్యంగా ఉంచటానికి సహాయపడుతుంది. అలాగే తక్షణ శక్తిని అందిస్తుంది.

ఐస్ క్రీమ్ లో ఉండే ప్రోటీన్ రోజంతా ఉషారుగా ఉండేలా చేస్తుంది . అంతేకాక దంతాలు ఆరోగ్యంగా చిగుళ్లు బలంగా ఉండేలా చేస్తుంది. చాకోలెట్ ఐస్ క్రీమ్ లో ఫ్లవనాయిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల గుండెకు సంబందించిన సమస్యలు ఉన్నవారు చాకొలేట్ ఐస్ క్రీమ్ తింటే మంచిది. డార్క్ చాక్లెట్ లో వుండే ఫ్లేవనాయిడ్లు మీ రక్తనాళాలు బ్లాక్ కాకుండా రక్షిస్తాయి. ఐస్ క్రీమ్ లో విటమిన్ ఎ,డి,కె మరియు బి12 వుంటాయి.

విటమిన్ ఎ కంటి చూపు మెరుగుపరచడంలో సహాయపడుతుంది. విటమిన్ డి కాల్షియం మరియు ఇతర పోషకాలను ఆహారం నుండి తీసుకొని కిడ్నీలలో వుంచుతుంది. విటమిన్ కె శరీరంలో రక్తప్రసరణ అధికంగా ఉండేలా చేస్తుంది. మూసుకున్న రక్తకణాలను తెరుస్తుంది. అంతేకాక రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. విటమిన్ బి 12 మెమొరీ పెంచి నరాల వ్యవస్ధను మెరుగుపరుస్తుంది.
gas troble home remedies
ఐస్ క్రీమ్ రోగనిరోధక వ్యవస్థను బలంగా చేసి జీర్ణశయాంతర మరియు శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. ఐస్ క్రీమ్ తింటే మానసిక ఒత్తిడి అంతా తొలగిపోయి ఉల్లాసంగా ఉంటారు. బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అయితే ఐస్ క్రీమ్ తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. ఐస్ క్రీమ్ లో కొవ్వు ఉంటుంది కాబట్టి ఎక్కువ మొత్తంలో తీసుకుంటే రక్తంలో కొలస్ట్రాల్ శాతం పెరుగుతుంది.

ఇది రక్తపోటును పెంచుతుంది. ఐస్ క్రీంలో చక్కెర అధికంగా ఉండుట వలన రక్తంలో చక్కెర శాతం పెరగడం, బరువు పెరగడం మరియు హార్మోన్ల అసాధారణ హెచ్చుతగ్గులకు దారితీయటం వంటివి జరుగుతూ ఉంటాయి. లాక్టోస్ ఎలర్జీ ఉన్నవారు ఐస్ క్రీమ్ కి దూరంగా ఉంటేనే మంచిది. ఒకవేళ ఐస్ క్రీమ్ తింటే జీర్ణాశయ సమస్యలు వస్తాయి.
ice cream
ఐస్ క్రీమ్ లో కాల్షియం ఎక్కువగా ఉండుట వలన ఐస్ క్రీమ్ ని ఎక్కువగా తీసుకుంటే మలబద్ధకం, ఆకలి లేకపోవటం, మూత్రపిండాల నొప్పి, వికారం, తరచూ మూత్రవిసర్జన, అధిక దాహం, ఉదాసీనత, కండరాల మెలికలు, చిరాకు మరియు నిరాశ వంటి సమస్యలు ఎదురౌతాయి. ఖాళీ కడుపుతో ఐస్ క్రీమ్ ని అసలు తినకూడదు. రక్త ప్రవాహంలో కార్బోహైడ్రేట్ శోషణను తగ్గిస్తుంది. ప్యాంక్రియాటిక్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సైనస్ ఇన్ ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News