Black Tea:వారంలో 2 సార్లు బ్లాక్ టీ తాగండి…ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు
Black Tea Health benefits:మనలో చాలా మంది ఉదయం లేవగానే కాఫీ లేదా టీ తాగుతూ ఉంటారు. ఆ సమయంలో Black Tea తాగవచ్చు. అయితే వారంలో రెండు సార్లు Black Tea తాగితే ఎన్నో ఊహించని ప్రయోజనాలను పొందవచ్చు. Black Tea లో జింక్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్లు బి2, సి మరియు ఇ మరియు పాలీఫెనాల్స్ సమృద్దిగా ఉండుట వలన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచటమే కాకుండా ముడతలు రాకుండా నివారిస్తుంది.
బ్లాక్ టీలో ఫ్లేవనాయిడ్లు మరియు బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉండుట వలన చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. మాంగనీస్ గుండె కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి in ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.
బ్లాక్ టీలో ఉండే కెఫిన్ జుట్టు రాలటానికి కారణం అయినా DHT (డైహైడ్రోటెస్టోస్టెరాన్) అనే హార్మోన్‌ను తగ్గిస్తుంది. బ్లాక్ టీలోని యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. జుట్టు కుడుళ్ళను బలంగా మార్చి జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.
బ్లాక్ టీలోని కెఫిన్ మెదడులో రక్త ప్రవాహాన్ని పెంచడం ద్వారా ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. బ్లాక్ టీ ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్‌ను తగ్గించి జ్ఞాపకశక్తి పనితీరును మెరుగుపరుస్తుందని ఇటివల జరిగిన పరిశోదనలో తేలింది. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచటమే కాకుండా కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News