Healthy Food: పేదవాడి బాదం వేరుశనగ.. తక్కువ ఖర్చులో ఊహించని ఎన్నో ప్రయోజనాలు
Groundnuts Health benefits in telugu :Dry Fruits ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అందరికి అందుబాటు ధరలో ఉండే వేరుశనగ గింజలను తింటే ఎన్నో ఊహించని పోషకాలు మన శరీరానికి అంది ఆరోగ్యప్రయోజనాలు అందుతాయి. వేరుశనగ గింజలను పేదవాని బాదంగా చెప్పుతారు. ఎందుకంటే బాదంలో ఉండే పోషకాలు అన్ని దాదాపుగా వేరుశనగలో ఉంటాయి.
పేదవాని బాదంగా చెప్పే వేరుశెనగలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. రోజు గుప్పెడు తింటే ఎన్నో పోషకాలు మన శరీరానికి అందుతాయి. చాలామంది సాయంత్రం సమయంలో టైం పాస్ కోసం Evening స్నాక్స్ గా తింటూ ఉంటారు. అయితే కొంతమందికి వేరు శనగలు తింటే కొన్ని సమస్యలు వస్తాయి.
వేరుశెనగలో ప్రోటీన్స్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వు, పొటాషియం,ఫాస్ఫరస్,మెగ్నీషియం, నియాసిన్, థయామిన్ వంటివి సమృద్ధిగా ఉంటాయి.
వేరుశెనగ తినడం వల్ల రక్తం గడ్డ కట్టడాన్ని ఆపుతుంది. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు రావు. అలాగే అధిక బరువు సమస్య నుంచి బయటపడేస్తుంది. .
అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అయితే కొంతమంది వేరుశనగలను తీసుకోకూడదు. ఎవరు తీసుకోకూడదు అనేది తెలుసు కుందాం. చర్మంపై ఎలర్జీ, దురద, ముఖంపై వాపు వంటి సమస్యలు ఉన్నవారు వేరుశనగ ఎక్కువగా తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే ఆ సమస్యల ప్రభావం పెరుగుతుంది.
అలాగే గ్యాస్ సమస్య ఉన్నవారు కూడా వేరుశనగను తీసుకోకుండా ఉంటేనే మంచిది. అలాగే కాలేయ సమస్యలు ఉన్నవారు కూడా ఎక్కువగా తీసుకోకూడదు. వీటి నుంచి విడుదల అయ్యే ఒక రసాయనం కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. వేరుశనగ గింజలను తీసుకున్న వెంటనే నీటిని తాగకూడదు.
ఇలా నీటిని తాగితే జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి. అంతేకాకుండా జలుబు, దగ్గు వంటివి వస్తూ ఉంటాయి. అజీర్ణ సమస్య ఉన్నవారు కూడా వేరుశనగకు దూరంగా ఉంటేనే మంచిది. ఏదైనా లిమిట్ దాటితే అనర్ధమే. ఇప్పుడు చెప్పిన సమస్యలు ఉన్నవారు వేరుశనగను తీసుకొనే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.