Kushi Movie:ఇన్ని సంవత్సరాలకు బయట పడిన ఖుషి ‘నడుము’ రహస్యం…ఏమిటో…?
Kushi Movie: పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడిగా సినీ పరిశ్రమకు వచ్చినా చాలా తక్కువ సమయంలోనే తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకోవటంలో సక్సెస్ అయ్యాడు. పవన్ కళ్యాణ్, భూమిక జంటగా నటించిన ‘ఖుషి’ సినిమా విడుదల అయ్యి ఇన్ని సంవత్సరాలు అయినా…ఈ సినిమాలో నడుము సీన్ ఆ రోజుల్లో సంచలనం అయింది.
అయితే ఆ సీన్ ఈ సినిమా మాతృక అయినా తమిళ సినిమాలో మాత్రం పెద్దగా హైలెట్ అవ్వలేదు. ఇప్పటికి తెలుగులో ‘ఖుషి’ సినిమా ఆంటే ఆ నడుము సీన్ గుర్తుకు వస్తుంది. ఈ సీన్ ఇంతలా హైలెట్ కావటానికి చిత్ర యూనిట్ ఒక పని చేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
ఈ నడుము సీన్ తమిళంలో పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. దాంతో ఈ సినిమా దర్శకుడు సూర్య తెలుగులో ఈ సీన్ ని బాగా హైలెట్ చేయాలనే ఉద్దేశంతో ఎక్కువ శ్రద్ద పెట్టినట్టు సమాచారం. భూమిక నడుము బాగా మెరవటానికి షూటింగ్ చేయటానికి ముందు బాగా పియర్స్ సబ్బుతో వాష్ చేయించాడట.
భూమిక నడుము బాగా మెరుపు వచ్చే వరకు పియర్స్ సబ్బుతో వాష్ చేయించి…ఆ తర్వాతనే సీన్స్ చిత్రీకరణ జరిపాడట. పియర్స్ సబ్బు మహత్యం ఏమో కానీ ఆ సినిమాలో భూమిక నడుము మెరవటం…అది తెలుగు ప్రేక్షకులకు నచ్చటం సినిమా హిట్ అవ్వటం చకచకా జరిగిపోయాయి.
సినిమా విడుదల అయ్యి ఇన్ని సంవత్సరాలు అయినా సరే ‘ఖుషి’ సినిమా అనగానే భూమిక నడుము గుర్తుకువస్తుంది. అంటే ఈ సీన్ ఎంతలా ఆకట్టుకుందో అర్ధం చేసుకోవచ్చు.
Click Here To Follow Chaipakodi On Google News