Sai Pallavi :సాయి పల్లవికి మేకప్ వేసుకోవడం నచ్చదు.. అసలు కారణం ఏంటంటే
Tollywood Heroine Sai Pallavi:సాయి పల్లవి మొదటి నుంచి ఇప్పటి వరకు తనకంటూ కొన్ని రూల్స్ పెట్టుకొని వాటిని పాటిస్తూ సినిమాలు చేస్తూ సక్సెస్ గా ముందుకు సాగుతుంది. సాయి పల్లవి సినిమా చేసిందంటే ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. సాయి పల్లవి మలయాళంలో ‘ప్రేమమ్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో అచ్ఛమైన మళయాళీగా నటించి ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకుంది.
అలాగే తెలుగు ‘ఫిదా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి అచ్చమైన తెలంగాణ అమ్మాయిగా నటించి తెలుగువారి మనస్సుల్లో స్థానం సంపాదించింది. సాయి పల్లవి అనేక ఆసక్తికర విషయాలు చెప్పింది. తాను మేకప్ వేసుకోకుండా నటించడానికి “ప్రేమమ్” దర్శకుడు ఆల్ఫోన్స్ పుతెరిన్ కారణమని చెప్పింది.
సహజంగా నటించమని ఆయనే ప్రోత్సహించినట్లు వెల్లడించింది. “ఆల్ఫోన్స్ తో పాటు నేను పనిచేసిన దర్శకులందరూ నా ఆత్మవిశ్వాసం పెరగడానికి దోహదపడ్డారు.
అమ్మాయిల్లో ఆత్మస్థైర్యం పెంచడానికి కూడా నేను మేకప్ లేకుండా నటిస్తున్నాను” అని వివరించింది. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటిస్తూ అభిమానుల్లో మంచి పేరును సంపాదించుకుంది.
Click Here To Follow Chaipakodi On Google News