Curry Leaves for Diabetes:షుగర్ ని కంట్రోల్ చేసే పవర్ ఫుల్ ఆకు…కేవలం 5 రూపాయిల ఖర్చు…చాలా సింపుల్
Curry Leaves for Diabetes : డయాబెటిస్ నియంత్రణలో కరివేపాకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే మనలో చాలా మందికి ఈ విషయం తెలియక కరివేపాకును పెద్దగా పట్టించుకోము. అయితే ప్రతి రోజు కరివేపాకు తీసుకుంటే మాత్రం డయాబెటిస్ నియంత్రణలో ఉండటమే కాకుండా ఎన్నో సమస్యలకు చెక్ పెడుతుంది.
డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకొనే ఆహారం కూడా చాలా కీలకమైన పాత్రను పోషిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు కరివేపాకు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని ఇటీవల జరిగిన పరిశోదనల్లో తేలింది. డయాబెటిస్ ఉన్నవారు జీవితకాలం మందులు వాడాలి.
అలా మందులు వాడుతూ డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవాలి. కరివేపాకును ప్రతి రోజు తీసుకుంటే కరివేపాకులో ఉండే యాంటీఆక్సిడెంట్లు స్టార్చ్ ను గ్లూకోజ్ గా మారకుండా నిరోదిస్తుంది. కరివేపాకులో విటమిన్లు, బీటా కెరోటిన్ మరియు కార్బజోల్ ఆల్కలాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ నష్టాన్ని తగ్గిస్తాయి.
కరివేపాకులో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన శరీరంలో చక్కెరను పీల్చుకునే ప్రక్రియను మందగించడానికి సహాయపడుతుంది.దాంతో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఉదయం కరివేపాకు కషాయం తయారుచేసుకొని తాగవచ్చు. లేదా కరివేపాకు పొడి తయారుచేసుకొని వేడి నీటిలో కలుపుకొని తాగవచ్చు.
కరివేపాకును ఏ రూపంలో తీసుకున్న రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కాబట్టి డయాబెటీస్‌తో బాధపడేవారు.. డయాబెటీస్ రాకుండా ఉండాలని అనుకునేవారు కరివేపాకుని హ్యాపీగా తినేసేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News