MoviesTollywood news in telugu

Top 10 Rich Actors:షారూఖ్ ఖాన్ టూ రామ్ చరణ్ .. భారత్ లో టాప్ 10 రిచ్ హీరోలు ఎవరు…?

Top 10 Rich actors: బాలీవుడ్, కన్నడ, తమిళం, మలయాళం వంటి సినిమాల్లో భారీ బడ్జెట్ సినిమాల ట్రెండ్ కొనసాగుతుంది. సినిమాల భారీ బడ్జెట్ తో పాటు హీరోల పారితోషికాలు కూడా భారీగానే పెరిగాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ప్రకారం భారత్ లో టాప్ 10 రిచ్ హీరోలు ఎవరో చూద్దాం.

షారూఖ్ ఖాన్ ఆస్తుల విలువ దాదాపు రూ.6300 కోట్లు. షారూఖ్ ఖాన్ హీరోగా సినిమాలు, ఐపీఎల్ లో సొంత జట్టు, నిర్మాణ సంస్థ, పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ సంపాదిస్తున్నాడు.

హృతిక్ ఆస్తి విలువ దాదాపు రూ.3100 కోట్లు. ఒక్కో సినిమాకు 50 నుంచి 60 కోట్లు, బ్రాండ్ ప్రమోషన్ కోసం రూ.10కోట్ల వరకు తీసుకుంటాడు.

అమితాబ్ బచ్చన్(amitabh bachchan) ఒక పక్క సినిమాలు చేస్తూ మరో పక్క కౌన్ బనేగా కరోడ్ పతి అనే టెలివిజన్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఒక్కో సినిమాకు 10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నాడు. ఆయన ఆస్తి 3000 కోట్ల రూపాయలు.

సల్మాన్ ఖాన్ ఆస్తి సుమారు రూ. 2850 కోట్లు ఉన్నట్టు సమాచారం. ఒక పక్క సినిమాలు మరో పక్క టెలివిజన్ షో,సొంత దుస్తుల బ్రాండ్ ఉంది.

అక్షయ్ కుమార్ ఆస్తి రూ.2,660 కోట్లు ఉంటుంది.

అమీర్ ఖాన్ ఆస్తి రూ.1862 కోట్లు ఉంది. ఒక పక్క సినిమాలు మరొక పక్క నిర్మాణ సంస్థ, మరొక పక్క చాలా వెంచర్లలో పెట్టుబడి పెట్టాడు.

రామ్ చరణ్ ఆస్తి రూ.1370 కోట్లు. ఒక పక్క హీరోగా నటిస్తూ మరో పక్క తండ్రితో సినిమాలు నిర్మిస్తున్నాడు. అలాగే ఎన్నో బిజినెస్ లలో పెట్టుబడులు ఉన్నాయి.

అక్కినేని నాగార్జున ఒక పక్క సినిమాలలో నటిస్తూ, మరో పక్క సినిమాలను నిర్మిస్తూ, మరో పక్క TV షో చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు. నాగార్జున ఆస్తి విలువ 950 కోట్ల రూపాయలు. ఒక్కో సినిమాకు 10 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు. బిగ్ బాస్ కోసం రూ.15 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం.

రజనీకాంత్ ఆస్తి దాదాపు 450 కోట్ల రూపాయలు. ఈ మధ్య విడుదల అయినా జైలర్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

అల్లు arjun ఆస్తి 380 కోట్ల రూపాయలు. అతనికి సొంత మల్టీప్లెక్స్ ఉంది. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు.