Iron Cleaning:కాలిన ఐరన్ బాక్స్ మీద మరకలు రెండు నిమిషాల్లో మాయం…చాలా సింపుల్
Iron Cleaning tips in telugu: మనం ఇంటిలో బట్టలను ఐరన్ చేస్తూ ఉంటాం. అలా చేసినప్పుడు ఒక్కోసారి వేడి ఎక్కువ అవ్వటం వలన దుస్తులు కాలి ఐరన్ బాక్సుకు నల్లటి మరకలు ఏర్పడటం సాదారణంగా జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత బట్టలను ఐరన్ చేసిన్పప్పుడు ఆ మరకలు ఆ దుస్తులకు అంటుతుంటాయి.
ఈ మరకలను వదిలించటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా పెద్దగా పలితాన్ని ఇవ్వవు. అయితే ఇప్పుడు చెప్పే చిట్కాలను ఫాలో అయితే చాలా సులభంగా ఐరన్ బాక్స్ మీద మరకలను తొలగించుకోవచ్చు.
ఐరన్ బాక్సుకు అంటుకున్న మరకలను, గీతలను తొలగించటానికి వెనిగర్ కూడా చాలా బాగా సహాయపడుతుంది. వైట్ వెనిగర్‌ను వేడి చేసి అందులో క్లాత్‌ను ముంచి ఐరన్ బాక్స్ ప్లేట్‌ను తుడవాలి. మరకలు పోయాక నీటిలో క్లాత్‌ను ముంచి మళ్లీ ఐరన్ బాక్స్ ప్లేట్‌ను తుడిస్తే సరిపోతుంది.
ఒకవేళ ఇంకా మరకలు ఉంటే..వెనిగర్ లో ఉప్పు లేదా బేకింగ్ సోడా వేసి బాగా కలిపి ఈ మిశ్రమంతో మరకలు ఉన్న ప్రదేశంలో రుద్దితే సరిపోతుంది.
క్లాత్‌ను హైడ్రోజన్ పెరాక్సైడ్లో ముంచి ఐరన్ బాక్సుతో రుద్దితే మరకలు చాలా సులభంగా పోతాయి. హైడ్రోజన్ పెరాక్సైడ్ మెడికల్ షాప్స్ లో లభ్యం అవుతుంది.
ఐరన్ బాక్సుకు అంటుకున్న మరకలను, గీతలను తొలగించటానికి ఉప్పు బాగా సహాయపడుతుంది. ఒక మృదువైన క్లాత్ మీద ఒక గ్లాసు ఉప్పును ఒక పొరలా పోయాలి. ఆ తర్వాత ఐరన్ బాక్స్‌ను మ్యాగ్జిమమ్కు పెంచేసి హీట్ అయ్యాక దాన్ని ఉప్పుపై రుద్దండి. ఇలా చేయడం వల్ల ఐరన్ బాక్సుకు అంటుకున్న మరకలు పోతాయి. ఐరన్ బాక్స్ చల్లారక ఓ పాత గుడ్డపై ఐరన్ ప్లేట్‌ను తుడవండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News