MoviesTollywood news in telugu

Anchor Suma:సుమతో పెళ్లికి రాజీవ్ పెట్టిన కండిషన్ ఏమిటో తెలుసా ?

Telugu Anchor Suma : Tv రంగంలో సుమకు ఉన్న పాపులారిటి మరే యాంకర్ కి లేదు. ఒక వైపు యాంకరింగ్ మరొక వైపు సినిమా వేడుకలకు హోస్ట్ చేస్తూ బిజీగా గడుపుతుంది. సోషల్ మీడియాలో సుమ గురించి ఏదోక వార్త వస్తూనే ఉంటుంది. సుమ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. ఆమె అంతలా బుల్లితెరనుఏలేస్తుంది.

ఆమె మలయాళీ అయినా తెలుగు చాలా స్వచ్ఛంగా మాట్లాడుతూ తెలుగు అమ్మాయిల మనలో కలిసి పోయింది. ఒకవైపు బుల్లితెర లో షో లు చేస్తూ మరోవైపు సినిమా ఫంక్షన్లు చేస్తూ చాలా బిజీగా ఉంది. నిన్న సుమ పుట్టినరోజు సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆమె భర్త రాజీవ్ కనకాల తో ప్రేమ పెళ్లి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పింది. రాజీవ్ సుమ 1999వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు వీరి ప్రేమ ప్రయాణం 1994వ సంవత్సరంలో మొదలైంది

మొదట రాజీవ్ ప్రపోజ్ చేశాడు సుమ మొదట్లో రిజెక్ట్ చేసింది ఆ తర్వాత ఓకే చేసింది అప్పుడు రాజీవ్ ఒక కండిషన్ పెట్టాడు పెళ్ళి తరవాత సినిమాలు చేయడం మానేయలి అని. దాంతో సుమ పెళ్లి చేసుకోను అని చెప్పి సంవత్సరంన్నర పాటు మాట్లాడలేదు రాజీవ్ తో. ఆ సమయంలో రెండు మూడు సినిమాలు చేసింది.

సినిమా రంగం నచ్చక సినిమాలను వదిలేసింది అప్పుడు రాజీవ్ తో మాట్లాడి తమ ప్రేమ గురించి రాజీవ్ తండ్రి దేవదాస్ కనకాల తో మాట్లాడి 99 లో పెళ్లి చేసుకున్నారు. తనకు రాజీవే మొదటి విమర్శకుడనీ, ఏవైనా కార్యక్రమాల విషయంలో బాగుంటే చాలా మెచ్చుకుంటాడని చెప్పుకొచ్చారు.