Phool Makhana Kheer: ఫూల్ మఖానా పాయసం..ట్రై చేసి చూడండి..!
Phool Makhana Kheer: ఫూల్ మఖానా పాయసం ఒక ప్రసిద్ధ భారతీయ డెజర్ట్. దీనిని లోటస్ సీడ్స్ తో తయారు చేస్తారు. ఇది చాలా రుచికరమైనది మాత్రమే కాకుండా, పోషకాలతో నిండి ఉంటుంది.
ఎప్పుడూ సాలిడ్ ఫుడ్స్ కాదు. అప్పుడప్పు లిక్విడ్స్ కూడా మన బాడీకి అందివ్వాలి. బాదాం మిల్క్, మిల్క్ షేక్స్, ఇలా రొటీన్ లిక్విడ్స్ కాకుండా, హెల్తీ ఫూల్ మఖనా ఖీర్ ఎలా చేయాలా చూద్దాం.
కావాల్సిన పదార్ధాలు
పాలు- 500 మిల్లీ లీటర్లు
తామర గింజలు – 1 కప్పు
నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్
జీడిపప్పు – 1 టేబుల్ స్పూన్స్
ఎండు ద్రాక్ష – 1 టేబుల్ స్పూన్స్
కుంకుమపుప్పు – చిటికెడు
చెక్కర – ¼ కప్పు
యాలకుల పొడి – 1/2టీ స్పూన్
తయారీ విధానం
1.ముందగా స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకుని, అర లీటర్ పాలు చిక్కటి పాలను, వేడి చేసుకోవాలి.
2. ఈ లోపు స్టవ్ పై ఒక పాన్ పెట్టుకుని, తామర గింజలను దోరగా వేయించుకోవాలి.
3. వేగిన తామర గింజలను ఒక బౌల్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి.
4. ఇప్పుడు అదే పాన్ లోకి నెయ్యి వేసుకుని, బాదం పప్పులు జీడిపప్పులు ఎండు ద్రాక్షలు వేసి వేయించుకోవాలి.
5. ఇప్పుడు చల్లారిన తామర గింజలను మిక్సీ జార్ లో వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
6. ఈలోపు మరిగిన పాలలో, కుంకుమ పుప్పు యాడ్ చేసుకుని కలుపుకోవాలి.
7. ఇఫ్పుడు పాలల్లోకి గ్రైండ్ చేసుకున్న తామర గింజల పొడి, పాలల్లో బాగా కలిసేలా కలుపుకోవాలి.
8. లో ఫ్లే మ్ లోఉండలు కట్టకుండా బాగా కలపాలి.
9. ఇప్పుడు అందులోకి చక్కెర యాడ్ చేసి, కరిగే వరకు కలపుకోవాలి.
10.ఇప్పుడు నెయ్యితో పాటుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ ను, అందులోకి వేసుకోవాలి.
11. చివరగా, హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే వేడి వేడి ఫూల్ మఖనా ఖీర్ రెడీ.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u