Kitchenvantalu

Egg Masala Fry:ఉడ‌క‌బెట్టిన కోడిగుడ్ల‌తో ఇలా మ‌సాలా ఎగ్ ఫ్రైని ఎప్పుడైనా చేశారా.. ఒక్క‌సారి చేసి తినండి

Egg Masala Fry: రుచికి బలానికి, బ్రాండ్ అంబాసిడర్ గుడ్డు. ఎగ్ ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారా..కాకపోతే ఒకే స్టైల్ రిపీట్ చేస్తే, ఎవరి కైనా బోర్ కొట్టేస్తుంది. అందుకే కాస్త వెరైటీగా, ఉడికించిన గుడ్డు మసాలా FRy చేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
ఉడికించిన గుడ్లు -4
ఉల్లిపాయలు -3
పచ్చిమిర్చి -4
ఉప్పు – తగినంత
కారం – ఒక టేబుల్ స్పూన్
పసుపు – ¼ టీ స్పూన్
పుదీనా – కొద్దిగా
కొత్తిమీర – కొద్దిగా
నూనె – 4 టెబుల్ స్పూన్లు
ధనియాలు – 2 టేబుల్ స్పూన్లు
గసగసాలు – 2 టీ స్పూన్లు
ఎండుకొబ్బరి – ¼ కప్పు
సోంపు –
దాల్చిన చెక్క – 1 ఇంచ్
యాలకులు –3
లవంగాలు -4
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్

తయారీ విధానం
1.ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకుని, వేడెక్కిన పాన్ లో అన్ని మసాలా దినుసులు, వాసన వచ్చేంతవరకు, చిన్నమంట పై వేయించుకోవాలి.
2. ఇప్పుడు చల్లారని దినుసులను ,మిక్సీ జార్ లో వేసుకుని, మెత్తడి పొడిగా తయారు చేసుకోవాలి.
3. ఇప్పుడు అదే పాన్ లో ఆయిల్ వేసి, ఉడికించిన గుడ్లను వేసుకుని, రంగు వచ్చేవరకు వేయించికుని పక్కన పెట్టుకోవాలి.
4. అదే పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకుని, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుని, కొద్దిగా ఉప్పు యాడ్ చేసి, ఉల్లిపాయలు మెత్తపడేవరకు ఫ్రై చేయాలి.

5 . ఇప్పుడు అందులోకి, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, ఒక రెండు నిముషాలు వేగనివ్వాలి.
6. ఇప్పుడు ముందుగా ఉడకపెట్టుకున్న గుడ్లను, పొడవాటి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
7. కట్ చేసుకున్న ముక్కలను ఉల్లిపాయలతో యాడ్ చేసి, గ్రైండ్ చేసి పెట్టుకుని మసాలా పొడిని వేసి ఒక రెండు నిముషాలు వేయించుకోవాలి.
8. చివరగా సన్నగా తిరిగిన కొత్తిమీర, పుదీనా కూరపై చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే, ఘుమఘుమలాడే ఎగ్ మసాలా కర్రీ రెడీ.

Click Here To Follow Chaipakodi On Google News