Veg Butter Masala:హోటల్స్‌లో లభించే వెజ్ బటర్ మసాలాను.. ఇంట్లోనే ఇలా చేయండి.. ఎంతో బాగుంటుంది..!
Veg Butter Masala: రైస్, చపాతీ, రోటీ, టిఫిన్ ఏదైనా, అందులోకి సరైన కాంబినేషన్ కర్రీ ఉంటేనే, ఆ టేస్ట్ తెలుస్తుంది. ముఖ్యంగా గ్రేవీ కర్రీస్, రోటీస్ కు సూపర్ కాంబినేషన్. మసాలా గ్రేవీ కర్రీస్ లో , మిక్స్డ్ వెజ్ బటర్ మసాలా ఎలా చేసుకోవాలో తెల్సుకుందాం.
కావాల్సిన పదార్దాలు
టమాటో -3
ఉల్లిపాయలు -1
జీడిపప్పు -20
కశ్మీర్ మిర్చి – 3
చక్కెర – 1/2టీస్పూన్
చెక్క- 1/2ఇంచ్
యాలకులు – 2
లవంగాలు -2
ఉప్పు –తగినంత
నూనె – 2 టేబుల్ స్పూన్స్
బంగాళ దుంప ముక్కలు – 1/3ముక్కలు
క్యారేట్ ముక్కలు -1/3ముక్కలు
బేబీ కార్న్ -3
ఫ్రెంచ్ బీన్స్ – 6
కాలీఫ్లవర్ ముక్కలు – 15
పనీర్ ముక్కలు – 1/3కప్పు
గ్రీన్ పీస్ -1/3కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
ఉప్పు- తగినంత
పసుపు – చిటికెడు
ధనియాల పొడి – 1/2టీస్పూన్
జీలకర్ర పొడి – 1/2టీస్పూన్
కారం – 1 టీ స్పూన్
కసూరి మేతి – 1 టీ స్పూన్
గరం మసాలా – 1/2టీ స్పూన్
బటర్ – 3 టేబుల్ స్పూన్స్
తాజా క్రీమ్ – 3 టేబుల్ స్పూన్స్
నెయ్యి – 1 స్పూన్
తయారీ విధానం
1.ఒక గిన్నెలోకి జీడిపప్పులు, చెక్క, 1/2టీ స్పూన్ షుగర్, ఉల్లిపాయలు,టమాటాలు వేసుకుని, తగినన్ని నీళ్లు పోసి, మెత్తని పేస్ట్ లా ఉడికించుకోవాలి.
2.స్టవ్ పై బాండీ పెట్టుకుని,అందులోకి నూనె వేసి, యాలకులు, బంగాళ దుంపలు, క్యారేట్, బేబీ కార్న్, బీన్స్, కాలీ ఫ్లవర్ వేసుకుని, కొద్దిగా ఉప్పు యాడ్ చేసి రెండు నిముషాలు వేయించుకోవాలి.
3.తర్వాత అందులోకి బటర్ వేసి, కూరగాయల ముక్కలు గోల్డెన్ కలర్ లోకి వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి.
4.ఇప్పుడు అందులోకి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, గరం మసాల, కసూరి మేతి, జోడించి, బాగా కలుపుకోవాలి.
5.ఇప్పుడు అందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటా పేస్ట్ ను యాడ్ చేసి బాగా కలపి మూత పెట్టుకోవాలి.
6.స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి, బటర్ పైకి తేలే వరకు ఉడికించాలి.
7.ఇప్పుడు పచ్చి బటానీలు వేసి, మరో ఐదు నిముషాలు ఉడికించాలి.
8.చివరగా పన్నీర్ పీసెస్, క్రీమ్, నెయ్యి వేసుకుని, ఒక నిముషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే .. మిక్స్డ్ వెజ్ బటర్ మసాలా రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News