Cooked Food:వండిన ఆహారాన్ని ఎన్ని నిమిషాల లోపల తినాలో తెలుసా…?
Cooking Food :మీకో విషయం తెలుసా…? వండిన ఆహార పదార్థాలను ఎంత టైమ్ లోపల తినాలి? ఏఏ పాత్రల్లో వండిన పదార్థాల్లో ఆరోగ్యానికి మంచిది? షాప్ నుండి తెచ్చుకున్న వస్తువులు ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంచుకోవాలి…ఇటువంటి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు తెల్సుకుందాం.
వంట వండిన 48 నిమిషాలలోపే తినేయాలి. ఎందుకంటే 48 నిమిషాల తర్వాత పదార్థంలోని పోషక విలువలు క్రమంగా తగ్గుకుంటూ పోతాయి. టైమ్ గడిచిన కొద్ది మనం తినే ఆహారంలో పోషక విలువలు 30శాతానికి పడిపోతాయి. కాబట్టి ఆహారాన్ని వండిన 48 నిమిషాలలోపే తింటే ఆరోగ్యానికి పూర్తి పోషకాలు అందే అవకాశం ఉంది.
48 నిమిషాలు-100 శాతం పోషక విలువలు ఉంటాయి.
2 గంటలు- 70 శాతం పోషకవిలువలుంటాయి.
5 గంటల తర్వాత-50 శాతం పోషక విలువలుంటాయి.
షాప్ నుండి తెచ్చుకునేటప్పుడు కూడా….సరిపడా నే తెచ్చుకోండి. ఎందుకంటే గోధుమ పిండి.-15 రోజులలో, జొన్న, రాగి, సజ్జ-7 రోజులలోపే పోషక విలువలను కలిగి ఉంటుంది. ఆ తర్వాత వాటిలో పోషక విలువలు క్రమంగా తగ్గుకుంటూ పోతాయి. కాబట్టి పిండిని ఆ నిర్ణీత గడువులోనే వాడితే మంచిది…. ఎప్పడికప్పుడు తెచ్చుకుంటే ఇంకా మంచిది.
ఏ పాత్రలలో వండితే భోజనం లోని పోషక విలువలు ఎలా ఉంటాయో చూద్దాం.
మట్టికుండలో వండితే 100% విలువలు అలాగే ఉంటాయి.
కంచు పాత్రలో-97%
ఇత్తడి పాత్రలో-93%
అల్యూమినియం, ప్రెషర్ కుక్కర్ లాంటి పాత్రలలో వండిన పదార్థాలలో 7-13% వరకు మాత్రమే.
పైగా అల్యూమినియం లాంటి పాత్రలల్లో వంటిన ఆహారాన్ని తనడం ద్వారా షుగర్, కీళ్ల వాతం,పొట్ట సంబధ వ్యాధులు, త్వరగా ముసలి వాళ్లు కావడం లాంటి దుష్పరిణామాలుంటాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News