Kitchenvantalu

Bendkaya Bajji:బెండకాయ బజ్జి కూర రుచిగా 10 నిమిషాల్లో ఇలా చేయండి..

Bendkaya Bajji: బెండకాయ బజ్జి కూర రుచిగా 10 నిమిషాల్లో ఇలా చేయండి.. బెండకాయ జిగురుగా ఉంటుట వలన తినటానికి పెద్దగా ఇష్టపడరు. ఇప్పుడు చెప్పే విధంగా చేస్తే మంచి రుచిగా ఉండటమే కాకుండా పిల్లలు ఇష్టంగా తింటారు.

బెండకాయ తింటే లెక్కలు బాగా వస్తాయో లేదో తెలియదుగాని పిల్లలు నో అని చెప్పకుండా మాత్రం తినేస్తారు.బెండకాయ ఫ్రై కాని,పులుసు కాని బజ్జీ కాని ఏది చేసినా బెండకాయ టేస్ట్ మాత్రం అదుర్స్ అనే చెప్పాలి. మరెందుకు ఆలస్యం ఎప్పుడు పులుసు ,ఫ్రైలే కాకుండా ఇలా రాయల సీమ స్టైల్లో బెండకాయ బజ్జీ తయారు చేయండి.

కావాల్సిన పధార్ధాలు
నూనె – 3 టేబుల్ స్పూన్స్
వెల్లుల్లి-10
టోమాటొ-2
పసుపు -1/2 టీ స్పూన్
ఉప్పు- తగినంత
పచ్చిమిర్చి-8
చింతపండు పులుసు-50 గ్రాములు
నీళ్లు -300 మిల్లి లీటర్లు
బెండకాయ ముక్కలు -300 గ్రాములు
తాలింపు కోసం
నూనె – 1 టేబుల్ స్పూన్
ఆవాలు – 1 టీస్పూన్
ఎండు మిర్చి 4
కరివేపాకు – 2 రెమ్మలు

తయారి విధానం
1.స్టవ్ పై బాండి పెట్టుకోని ఆయిల్ వేసి అందులోకి వెల్లుల్లి వేసి బాగా వేగనివ్వాలి వెల్లుల్లి వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక నిమిషం పాటు వేపుకోవాలి.
2.వేగిన ఉల్లిపాయల్లోకి టోమాటో ముక్కలు,పసుపు,ఉప్పు వేసి మెత్తపడేవరకు ఉడికించాలి.
3.మెత్తబడి టోమాటోలో బెండకాయ ముక్కలు వేసి కలిపి బెండకాయ జిగురు పోయేవరకు మూతపెట్టి మగ్గించాలి.
4. బెండకాయల్లో జిగురు వదిలిన తర్వాత, పచ్చిమిచ్చి, చింతపండు, నీళ్లు , పోసి బెండకాయులు ఉడికే వరకు, మీడియం ఫ్లేమ్ పై మరిగించుకుకోవాలి.

5. ఇప్పుడు మెత్తగా ఉడికిన బెండకాయలను, దింపుకుని, పప్పుగుత్తితో ఎనుపుకోవాలి.
6. ఇప్పుడు వేరొక ప్యాన్ లో నూనె వేసి, వేడెక్కిన తర్వాత ,అందులోకి ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు,
వేసి తాళింపు పెట్టి, బెండకాయ బజ్జీల్లో కలుపుకోవాలి.
7. అంతే, బెండకాయ బజ్జీ రెడీ అయిపోయినట్లే..
Click Here To Follow Chaipakodi On Google News

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ