Healthhealth tips in telugu

Almond and dates: బాదం,ఖర్జూరంలను పాలతో కలిపి తీసుకుంటే ఎన్నో సమస్యలకు చెక్

Dates and Almond Benefits :ఈ సీజన్ లో ఎన్నో రకాల సమస్యలు చాలా తొందరగా వచ్చేస్తూ ఉంటాయి. ఆ సమస్యలు రాకుండా ఉండాలన్నా, వచ్చిన సమస్యలను తగ్గించుకోవాలన్నా ఇప్పుడు చెప్పే పాలను రోజు విడిచి రోజు తాగితే మంచిది.

ఖర్జూర పండ్లలో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. రోజూ ఖర్జూరాలను తీసుకోవడం ద్వారా ఒక రోజుకు సరిపడా పోషకాహారం చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఖర్జూరాల్లో కాపర్, పొటాషియం, పీచు, మాంగనీస్, విటమిన్ బి6, మెగ్నీషియం వంటివి వున్నాయి. విటమిన్ ఎ ఇందులో ఉండటం ద్వారా కంటి దృష్టి లోపాలను దూరం చేసుకోవచ్చు.

ఖర్జూరాలు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. పేగు క్యాన్సర్‌ను దూరం చేస్తాయి. ఖర్జూరాలతో పాటు బాదం పప్పుల్ని పాలలో కలుపుకుని మరిగించి తీసుకుంటే నరాల బలహీనతకు చెక్ పెట్టొచ్చు. జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు. ఖర్జూరాల్లోని మెగ్నీషియం హృద్రోగ వ్యాధులను తగ్గిస్తుంది.

మహిళలు ఖర్జూరాలను గర్భధారణ సమయంలో తీసుకుంటే.. ప్రసవానంతరం శరీర బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.ఖర్జూర పండ్లలోని పొటాషియం గుండెను రక్తాన్ని సక్రమంగా అందేలా చేస్తుంది. రక్తపోటును నియంత్రించేందుకు ఖర్జూరాలు బాగా ఉపయోగపడతాయి.

ఖర్జూరాల్లోని ఐరన్ శరీరంలోని రక్తకణాల సంఖ్యను పెంచుతుంది. రక్తహీనతను తొలగిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్థులు రోజూ రెండు ఖర్జూరాలను తీసుకుంటే శరీరానికి పోషకాలు లభించడంతో పాటు బలం చేకూరుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News