Kitchenvantalu

Street Style Aloo Curry:ఆలూ కర్రీ ఇలా చేస్తే అన్నం, చపాతీలోకి అదిరిపోద్ది..

Street Style Aloo Curry Recipe: ఆలూ కర్రీ ఇలా చేస్తే అన్నం, చపాతీలోకి అదిరిపోద్ది.. కూరల్లో ఆకర్షనీయంగా అలావోకగా, చేసుకునే కర్రీ ఆలు స్పెషల్స్. వెజిటేరియన్స్ లిస్ట్ లో, ఎప్పుడూ ముందుండే,ఆలు కుర్మా ఎలా తయారు చేయాల్లో చూద్దాం.

కావాల్సిన పదార్ధాలు
ఉడికించి మ్యాష్ చేసుకున్న ఆలు – 3
నూనె – 4 టేబుల్ స్పూన్స్
ధంచిన ధనియాలు – 1 టీ స్పూన్
నలిపిన వాము -2 చిటికెలు
జీలకర్ర – 1 టీ స్పూన్
సోంపు – 1 టీ స్పూన్
ఇంగువ – 2 చిటికెలు
ఉల్లిపాయ తరుగు – 1 కప్పు
టమాటో తరుగు – 1 కప్పు
పచ్చిమిర్చి – 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి చీలకలు – 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
ధనియాల పొడి – 1 టీ స్పూన్
జీలకర్ర పొడి – 3/4స్పూన్
గరం మాసాల – 1/2టీస్పూన్
కారం – 1.25 స్పూన్
ఆమ్ చూర్ పొడి – 1/2టీ స్పూన్
పసుపు – 1/4టీ స్పూన్
ఉప్పు – తగినంత
నీళ్లు – 400 ML
కొత్తిమీర – చిన్న కట్ట
కసూరి మేతి – 1 టీ స్పూన్

తయారీ విధానం
1.స్టవ్ పై పాన్ పెట్టుకుని, నూనె వేసి, అందులోకి , సోంపు, జీలకర్ర, ధనియాలు, వాము వేసి, అవి వేగిన తర్వాత, ఉల్లిపాయ తరుగు వేసి రంగు వచ్చేదాకా వేపుకోవాలి.
2. ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, మిగిలిన మసాలాలు వేసి, ఫ్రై చేసుకోవాలి.
3. నూనె పైకి తేలాక, టమాటో తరుగు వేసి, కొన్ని నీళ్లు పోసి, గుజ్జుగా అయ్యేవరకు, మగ్గనివ్వాలి. వేగిన మసాలాలో, మెదుపుకున్న ఆలు, వేసుకుని, అడుగంటకుండా, వేపుకోవాలి,

4. ఆ తర్వాత అందులోకి నీళ్లు పోసి, హై ఫ్రేమ్ పై ఒక పొంగు రానివ్వాలి.
5. పొంగు వచ్చిన తర్వాత ఆలుని మెత్తగా చేసుకుని, కసూరి మేతి నలిపి వేసుకోవాలి.
6. చివరగా కొత్తిమీర చల్లుకుని, మీడియం ఫ్లేమ్ పై కాసేపు ఉడికించి దించేసుకోవాలి.
Click Here To Follow Chaipakodi On Google News