Kitchenvantalu

Hyderabadi Biryani:ఘుమఘుమలాడే హైదరాబాద్ దమ్ బిర్యాని.. ఇంట్లోనే ఇలా కచ్చితమైన కొలతలతో ఈజీగా చేసుకోవచ్చు..!

Hyderabadi Biryani Recipe: బిర్యానీ తినాలి అంటే ఏ అకేషన్ ,ఇన్విటేషన్,అవసరంలేదు..బిర్యానీ అంటేనే సెలబ్రేషన్.ఫ్రెండ్స్ కలిసిన,రిలేటివ్స్ వచ్చినా,అసలు ఏ సందర్బం లేకపోయినా పరువాలేదు బిర్యాని దావత్ చేసుకోడానికి.అయితే ప్రతి సారి బయటినుండి తెచ్చుకోవడం అంటే బోల్డంత ఖర్చు.అందుకే ఇంట్లోనే ఈజీగా వెజ్టెబుల్ బిర్యాని ఎలా చేసుకోవాలో చూసేయండి.

కావాల్సిన పధార్ధాలు
హర్యాలి పేస్ట్ కోసం
కొత్తిమీర- 50 గ్రాములు
పుదీనా- 50 గ్రాములు
పచ్చిమిర్చి- 4-5
అల్లం- ½ ఇంచ్
వెల్లుల్లి- 6-7 రెబ్బలు
పెరుగు ½ కప్పు
నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్
బిర్యానీ కోసం
మిరయాలు- ½ టీస్పూన్
షాజీరా- 1 టీస్పూన్
దాల్చిన చెక్క – 1.5 ఇంచ్
యాలకులు- 6
లవంగాలు- 5
నల్లయాలక- 1
జాపత్రి- 1
అనాస పువ్వు- 1
మరాటి మొగ్గ- 1
బిర్యానీ ఆకు- 1
కూరగాయలు

ఉల్లిపాయ – 1
ఆలు- ¼ కప్పు
కాలీఫ్లవర్ ముక్కలు- 15-20
ఫ్రెంచ్ బీన్స్- 4
క్యారెట్ ముక్కలు- ½ కప్పు
ఉప్పు – రుచికి సరిపడా
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
పొడి మసాల
పసుపు- ½ టీ స్పూన్
యాలకుల పొడి – 1 టీస్పూన్
గరం మసాల-1 టీ స్పూన్
కారం- 1.5 టీ స్పూన్
మిరయాల పొడి- 1/2 టీ స్పూన్
ధనియాల పొడి-1 టీ స్పూన్
జీలకర్రపొడి-1 టీ స్పూన్
బటానీ-1/2 కప్పు
పెరుగు- ½ కప్పు
నమ్మరసం-1 టీ స్పూన్
బిర్యానీ రైస్ కోసం

నీళ్లు- 2 లీటర్లు
పచ్చిమిర్చి- 2
ఉప్పు- తగినంత
లవంగాలు – 5
బియర్యానీ ఆకు- 1
షాజీరా- 1 టీ స్పూన్
యాలకులు- 6
మరాటీ మెగ్గ- 1
జాపత్రి- 1
దాల్చిన చెక్క- 1.5 ఇంచ్
నానబెట్టిన బాస్మతి బియ్యం- 2 కప్పులు
కేసర్ ఫుడ్ కలర్- 1 టీ స్పూన్
గరం మసాల- ¼ టీ స్పూన్
నెయ్యి- 2 టీ స్పూన్

తయారీ విధానం
1.హర్యాలి సేస్ట్ కోసం ఉంచిన పదార్ధాలన్ని మిక్సీలో వేసి నీళ్లతో మెత్తని పేస్ట్ చేసుకోండి.
2. బిర్యానీ వండే గిన్నెలోకి నెయ్యి, నూనె, వేడి చేసి, బిర్యాని మసాలాలు, వేసుకుని, వేగిన మసాలాల్లోకి, ఉల్లిపాయలు, వేసి, మెత్తపడే వరకు వేపుకోవాలి.
3. ఉల్లిపాయలు వేగిన తర్వాత, ఊరగాయ ముక్కలు వేసి, 60 శాతం ఫ్రై కానివ్వాలి. అందులోకి ఉప్పు, పొడి మసాలాలు వేసి వేపుకోవాలి.
4. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని, అందులోకి, హర్యాలీ పేస్ట్, ఫ్రోజెన్ బఠానీ, పెరుగు నిమ్మరసం, నూనె వేసుకుని కలుపుకోవాలి.
5. ఇప్పుడు బిర్యానీ రైస్ ఉండుకోవడానికి, మరుగుతున్న నీళ్లలో మసాలాలు, ఉప్పు, వేసి, మూడు నిముషాలు మరగనివ్వాలి.
6. ఇప్పుడు ఎసరు మరిగేటప్పుడు, నానపెట్టిన, బియ్యాన్ని వేసి, హై ఫ్లేమ్ పై 80 శాతం ఉడకనివ్వాలి.

7. ఉడికిన అన్నం, వడకట్టి, బర్యానీ కోసం, మసాలాలు కలిపి ఉంచిన కూరగాయల మీద వేసుకోవాలి.
8. అన్నం అంతా వేసిన తర్వాత పైన కొద్దిగా, గరం మాసాల, నెయ్యి, బిర్యాని ఉడికించుకున్న నీళ్లు,1/2 కప్పు వరకు వేసి, అన్నం అంతా దగ్గరగా కాకుండా చల్లినట్లు పోయాలి.
9. ఇప్పుడు కొద్ది ఆరెంజ్ కలర్ కూడా యాడ్ చేయాలి.
10. గిన్నె అంచులకు , మైదా పిండి ముద్దతో మూతకు ప్యాక్ చేసుకుని, కొద్దిగా,ఆవిరి బయటికి వచ్చేలా ఉంచుకోవాలి.
11. ఆ తర్వాత గిన్నెను స్టవ్ పై పెట్టుకుని, హై ఫ్లేమ్ పై ఉడికిస్తే, పిండివదిలిన చోట పొగలు ఎక్కువగా వస్తుంది.
12. ఆ టైమ్ లో వంటను లో ఫ్లేమ్ లోకి తగ్గించి, మరో 8 నిముషాలు ఉడికించి, స్టవ్ ఆఫ్ చేసుకుని, 20 నిముషాల పాటు పక్కన పెట్టాలి.
13. 20 నిముషాల తర్వాత మూత తీసుకుని ఘుమఘుమలాడే వెజ్ బిర్యానీ సెర్వ్ చేసుకోడమే..
Click Here To Follow Chaipakodi On Google News