Andhra Style Cucumber Chutney:నోటికి రుచిగా ఇలా దోసకాయ పచ్చడి చేసామంటే అన్న మొత్తం పచ్చడితోనే తినేస్తారు
Andhra Style Cucumber Chutney Recipe: నోటికి రుచిగా ఇలా దోసకాయ పచ్చడి చేసామంటే అన్న మొత్తం పచ్చడితోనే తినేస్తారు..పప్పు సాంబార్లో వాడుకునే దోసకాయ, విడిగా వండితే, పెద్దగా ఇష్టపడరు. కాని, ఆవ కలిపి పచ్చడి చేసి చూడండి. దోసకాయ కూడా ఫేవరేట్ అయిపోతుంది.
కావాల్సిన పదార్ధాలు
తాళింపు కోసం..
నూనె – 1 టీ స్పూన్
ఆవాలు – 1/2టీ స్పూన్
మెంతులు – 1/2టీ స్పూన్
మిపపప్పు – 1 టీ స్పూన్
పచ్చిశనగపప్పు – 1 టీ స్పూన్
జీలకర్ర – 1/2టీ స్పూన్
ఎండుమిర్చి – 2
ఇంగువ – 2 చిటికెలు
కరివేపాకు- 1 రెబ్బ
ఆవాల పేస్ట్ కోసం..
ఆవాలు – 1.5 టీ స్పూన్
పచ్చిమిర్చి -4
చింతపండు గుజ్జు – 1.5 టీ స్పూన్
ఉప్పు – కొద్దిగా
పసుపు – 2 చిటికెలు
దోసకాయ ముక్కలు – 175 గ్రాములు
నూనె – 2.5 టేబుల్ స్పూన్స్
తయారీ విధానం –
1.స్టవ్ పై బాండీ పెట్టుకుని, కొద్దిగా నూనె వేసి , ఆవాలు,మెంతులు, మినపప్పు, శనగపప్పు,వేసుకుని, మంచి వాసన వచ్చేవరకు వేపుకోవాలి.
2. తర్వాత అందులోకి, కరివేపాకు, ఎండుమిర్చి, కూడా వేసుకుని, వేపుకోవాలి.
3. వేగిన తాళింపుతో పాటు ఆవాల పేస్ట్ కోసం, పెట్టుకున్న , పదార్ధాలు అన్ని మిక్సీలో వేసి, మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
4. ఇప్పుడు ఒక గిన్నెలో దోసకాయ ముక్కలను తీసుకుని గ్రైండ్ చేసుకున్న ఆవాల పేస్ట్, నూనె, కలిపి, గంట సేపు, పక్కనపెట్టాలి.
5. అంతే తర్వాత, వేడి వేడి అన్నంలో నెయ్యి కలుపుకుని తింటే దోసకాయ ఆవ పచ్చడి అదిరిపోతుంది.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u