Instant Carrot Chutney: కేవలం 5 నిమిషాల్లో క్యారెట్ పచ్చడి ఇలా చేయండి ఎంత రుచిగా ఉంటుందో..
Instant Carrot Chutney Recipe: క్యారేట్ పచ్చిది తిన్న బలమే, పచ్చడి చేసుకుని తిన్నా బలమే, కంటికి, వంటికి, మేలు చేసే క్యారేట్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం.
కావాల్సిన పదార్ధాలు
క్యారేట్ తురుము – 200 గ్రాములు
నూనె – 1.5 టేబుల్ స్పూన్
మెంతులు – ½ టీస్పూన్
ఆవాలు – 1 టీ స్పూన్
మినపప్పు – 1 టీ స్పూన్
శనగపప్పు – 1 టీ స్పూన్
ఎండుమిర్చి – 2
పచ్చిమిర్చి – 3 లేదా 4
ఉప్పు – తగినంత
ఇంగువ – చిటికెడు
చింతపండు – ఉసిరి కాయ అంత సైజ్
కొత్తమీర – తాళింపు కోసం.
నూనె – 1.5 టీ స్పూన్
ఆవాలు – 1/2టీస్పూన్
జీలకర్ర – 1/2టీస్పూన్
ఎండుమిర్చి – 2
కరివేపాకు – 2 రెబ్బలు
తయారీ విధానం
1.స్టవ్ పై కడాయి పెట్టుకుని, నూనె వేడి చేసి అందులో, మెంతులు, ఆవాలు, వేసుకుని, ఎర్రగా వేపుకోవాలి.
2. అందులోకి మినపప్పు, శనగపప్పు, వేసి వేపాలి.
3. తర్వాత ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ, పచ్చిమిర్చి, కొత్తిమీర, చింతపండు వేసి, స్టవ్ ఆఫ్ చేసి కాసేపు వేపుకోవాలి.
4.చల్లారిన తాళింపు మిక్సీజార్ లోకి వేసుకుని, మెత్తని పొడి చేసి పెట్టుకోవాలి.
5. ఇప్పుడు పచ్చడి తాళింపు కోసం, కడాయిలో నూనె వేడి చేసి, అందులోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వేసుకుని, చివరగా కరివేపాకు వేసి వేపాలి.
6. వేగిన తాళింపులోకి స్టవ్ ఆఫ్ చేసి, క్యారేట్ తురుము , గ్రైండ్ చేసుకున్న తాళింపు పొడి వేసి, ఉప్పు వేసి, బాగా కలుపుకుని, గంట పాటు, వదిలేస్తే, క్యారేట్ పచ్చడి రెడీ అయిపోయినట్లే..
Click Here To Follow Chaipakodi On Google News