Sesame Rice:కేవలం 10 నిమిషాల్లో రెడీ అయ్యే నువ్వుల అన్నం.. లంచ్ బాక్స్ రెసిపీ..
Sesame Rice Recipe: ఆరోగ్యంలో పోషకాలలో, నువ్వుల గురించి చెప్పేది ఏముంది? రోజూ చిటికెడు నువ్వులు తిన్నా, శరీరం ధృడంగా తయారవుతుంది. అలాంటి నువ్వులతో తమిళనాడు స్పెషల్, నువ్వుల అన్నం చేసేద్దాం.
కావాల్సిన పదార్ధాలు
నువ్వుల కారం కోసం..
నల్లు నువ్వులు – 3 టేబుల్ స్పూన్స్
మినపప్పు – 3 టేబుల్ స్పూన్స్
ఎండుమిర్చి -8
కరివేపాకు – 1 రెబ్బ
ఇంగువ – 2 చిటికెలు
ఉప్పు – తగినంత
వండుకున్న అన్నం – 1 కప్పు
తాళింపు కోసం..
నువ్వుల నూనె / నెయ్యి – 3 టేబుల్ స్పూన్స్
ఆవాలు – 1 టీస్పూన్
చల్ల మిరపకాయలు – 3
కరివేపాకు – 2 రెబ్బలు
పచ్చిశనగపప్పు – 1 టేబుల్ స్పూన్
మిపపప్పు – 1 టేబుల్ స్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్
తయారీ విధానం
1.నువ్వుల కారం కోసం తీసుకున్న పదార్ధాలు అన్ని, ఒకోక్కటిగా ఎర్రగా వేపుకుని పక్కన పెట్టుకోవాలి.
2.ఇప్పుడు అందులోకి , నువ్వులు, కరివేపాకు, వేసుకుని సన్నని సెగ పై వేవుకోవాలి.
3. వేపుకున్న పదార్ధాలు అన్ని, మిక్సీ జార్లోకి వేసుకుని, మెత్తని పొడి చేసుకోవాలి.
4. గ్రైండ్ చేసుకున్న పొడిని, అన్నంలోకి వేసి, బాగా కలపాలి.
5. ఇప్పుడు తాళింపు కోసం, స్టవ్ పై ఆయిల్ పెట్టుకుని, వేడెక్కిన తర్వాత, చల్ల మిరపకాయలు, ఆవాలు, శగనపప్పు, మినపప్పు, కరివేపాకు, జీలకర్ర, వేసుకుని,
తాళింపు వేగిన తర్వాత అన్నం తాళింపులో వేసి బాగా కలుపుకోవాలి.
6. అంతే నువ్వుల అన్నం తయారైనట్లే..
Click Here To Follow Chaipakodi On Google News