Beauty Tips

White Hair Turn Black:అప్పుడే జుట్టు తెల్లబడుతుందా.. ఐతే ఇలా చేసి చూడండి..

White Hair Turn Black: వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధించే సమస్యలలో తెల్లజుట్టు సమస్య ప్రధానమైనది. తెల్లజుట్టు సమస్య రాగానే చాలా మంది కంగారు పడిపోయి హెయిర్ డై వాడుతూ ఉంటారు.

అయితే హెయిర్ డైలలో ఉన్న రసాయనాలు జుట్టును నిర్జీవం చేస్తాయి. హెన్నా అయితే పెట్టుకున్న కొన్ని రోజులకు రంగు పోయి తెల్లజుట్టు బయటపడుతుంది. ఎటువంటి సమస్యలు లేకుండా తెల్లజుట్టు నల్లగా మారాలంటే ఇప్పుడు చెప్పే చిట్కా చాలా బాగా సహాయపడుతుంది.

కొబ్బరి నూనె, రోజ్మేరీ రెండూ కూడా తెల్లజుట్టును నల్లగా మార్చటంలో చాలా అద్భుతంగా సహాయపడతాయి. కొబ్బరినూనెలో కొన్ని చుక్కల రోజ్మేరీ ఎస్సెంటియల్ ఆయిల్(rosemary essential oil) వేసి బాగా కలిపి జుట్టుకు రాయవచ్చు.

లేదంటే ఎండిన రోజ్మేరీ ఆకులను కొబ్బరినూనెలో వేసి గోరువెచ్చగా వేడి చేసి ఆ నూనెను జుట్టుకు రాసి మూడు గంటలు అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.

అంతేకాక జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. కాబట్టి హెయిర్ డైల జోలికి వెళ్ళకుండా కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.