Peanut Chutney:పల్లీ పచ్చడి అన్నంలోకి ఇలా చేసి పెడితే ఈ పచ్చడితోనే అన్నం మొత్తం లాగించేస్తారు
Peanut Chutney Recipe: పల్లీ చట్నీని ఇలా చేస్తే అన్నంలోకి మరియు ఇడ్లీ, dosa వంటి వాటికీ కూడా చాలా బాగుంటుంది.
కావలసిన పదార్ధాలు
పల్లీలు – 1 కప్పు
ఎండుమిర్చి – 10
ఉప్పు – తగినంత
చింతపండు – ఉసిరికాయంత
ఉల్లిపాయ తరుగు – 1/2కప్పు
టమాటో ముక్కలు – 1
ధనియాలు – 1 టేబుల్ స్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్
పసుపు – ¼ టీ స్పూన్
వెల్లుల్లి – 8
నూనె – 3 టేబుల్ స్పూన్స్
తయారి విధానం
1.కప్పు పల్లీలను సన్నని సెగ పై, వేయించుకుని, పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.
2. స్టవ్ పై కడాయి పెట్టుకుని, నూనె వేసి, అందులో ఎండుమిర్చి, వేపుకోవాలి.
3. వేగిన పల్లీలు, ఎండు మిర్చి, చింతపండు, కొద్దిగా నీళ్లు వేసుకుని, మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
4. ఇప్పుడు అదే బాండీలో, నూనె వేసి, ధనియాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, వేసి వేగనివ్వాలి.
5. ఇప్పుడు అందులోకి టమాటో ముక్కలు వేసి, 2 నిముషాలు వేగిన తర్వాత,మిక్సీ జార్ లో వేసుకుని, కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
6. మెదిగిన పచ్చడిలో ఆఖరుగా, తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కలిపితే అదిరిపోతుంది.
Click Here To Follow Chaipakodi On Google News