Aloo Capsicum Curry:క్యాప్సికం ఆలు కర్రీ ఇలా చేయండి.. అన్నం,చపాతి లోకి చాలా బాగుంటుంది
Aloo Capsicum Curry Recipe: పలావ్ లోకి ,బగారా రైస్ లోకి గ్రేవి కర్రీస్ నే ప్రిఫర్ చేస్తుంటాం. స్పైసీ పొలావ్ కి మరింత టేస్ట్ జోడించాలంటే ఆలు క్యాప్సికం కర్రీ చేయాల్సిందే.
కావాల్సిన పధార్ధాలు
గ్రేవీ కోసం..
నూనె- 2 టేబుల్ స్పూన్స్
పల్లీలు – ¼ కప్పు
పచ్చిమిర్చి – 4
ఉల్లిపాయ- 1
టమాటో- 3
పసుపు – ½ టీస్పూన్
ఉప్పు – తగినంత
కూర కోసం..
నూనె- 4 టేబుల్ స్పూన్స్
బంగాళదుంపలు- 3
పసుపు- చిటికెడు
ఉప్పు- తగినంత
క్యాప్సికం – 1 కప్పు
ఉల్లిపాయ – 1
నీళ్లు- 1 కప్పు
కారం – ½ టీస్పూన్
గరం మసాలా – ¼ టీ స్పూన్
కొత్తిమీర – కొద్దిగా
తయారీ విధానం
1.స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి పల్లీలు వేసి వేపుకోవాలి.పల్లీలు వేగాక ఉల్లిపాయ ముక్కలు ,పచ్చిమిర్చి వేసి మెత్తపడనివ్వాలి.
2.మెత్త పడ్డ ఉల్లిపాయల్లోకి టమటో ముక్కలు ,ఉప్పు ,పసుపు వేసి కలిపి మూతపెట్టి మెత్తగా మగ్గనివ్వాలి.
3.మగ్గిన టమాటోలను మిక్సి జార్ లో వేసుకోని పేస్ట్ ల చేసుకోవాలి.
4. స్టవ్ పై బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి అందులో తొక్క తీసిపెట్టుకున్న ఆలు ముక్కలు కొద్దిగా పసుపు,ఉప్పు వేసి కలిపి మూతపెట్టి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి.
5.వేగిని దుంపల్లో క్యాప్సికం పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకోవాలి.
6.అందులోకి ఉల్లిపాయలు వేసి మూడు నిమిషాలు వేపుకోవాలి.
7.ఇప్పుడు అందులోకి పల్లీల పేస్ట్ ని వేసి నీళ్లు, కారం వేసి బాగా కలుపుకొని 7-8 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పై దగ్గెర పడనివ్వాలి.
8.చివరగా గరంమసాల,కొత్తిమీర తరుగు వేసి కలిపుకోని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
9.అంతే ఆలు క్యాప్సికం కర్రీ రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News