White Hair Turn Black:వెంట్రుకలు తెల్లబడ్డాయా?ఇలా చేస్తే చాలా ఈజీగా నల్లగా మారతాయి..
White Hair Turn Black:తెల్లజుట్టు సమస్య రాగానే దాదాపుగా అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. తెల్లజుట్టు సమస్య ఈ మధ్య మారిన జీవనశైలి పరిస్థితి కారణంగా చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తుంది.
దాంతో మార్కెట్ లో దొరికే ఉత్పత్తుల మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇలా ఆ ఉత్పత్తులను ఎక్కువగా వాడితే జుట్టు రాలే సమస్య వంటి కొన్ని జుట్టుకు సంబందించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
తెల్లజుట్టు రావటం ప్రారంభం కాగానే జాగ్రత్త పడితే తెల్లజుట్టు పెరగదు.. అలాగే వచ్చిన తెల్లజుట్టు నల్లగా మారుతుంది. కాస్త శ్రద్ద,సమయాన్ని కేటాయిస్తే చాలా సులభంగా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.
తెల్లజుట్టును నల్లగా మార్చటంలో ఉసిరి,కొబ్బరి నూనె చాలా బాగా సహాయపడతాయి. కొబ్బరినూనెలో ఉసిరిపొడిని వేసి పేస్ట్ లాగా మిక్స్ చెయ్యాలి. ఈ పేస్టును జుట్టుకు అప్లై చెయ్యాలి. ముఖ్యంగా జుట్టు కుదుళ్ళకు బాగా పట్టించాలి. ఓ రెండు గంటలాగి తల స్నానం చెయ్యాలి.
ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. అలాగే జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.
ఈ చిట్కాను క్రమం తప్పకుండా ఫాలో అయితే తెల్లబడిన జుట్టు తప్పకుండా నలుపు రంగులోకి మారుతుంది. కాబట్టి తెల్లజుట్టు వచ్చినప్పుడు కంగారు పడకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.