Hair Care Tips: షాంపూలో వీటిని కలిపి రాసుకుంటే చుండ్రు, జుట్టు రాలే సమస్యే ఉండదు..
Hair Care Tips:మనలో చాలా మంది తలస్నానం చేయటానికి షాంపూ వాడుతూ ఉంటారు. వారంలో కనీసం రెండు సార్లు తలస్నానం చేస్తూ ఉంటారు. కొన్ని షాంపూలలో కెమికల్స్ ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు రాలిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే వాడే షాంపూలో కొన్ని పదార్ధాలను కలిపితే ఏ సమస్య ఉండదు.
జుట్టు రాలకుండా అందంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఈ రోజుల్లో ఎవరు కుంకుడుకాయ,శీకాయ వంటి వాటిని వాడటం లేదు. అందువల్ల మనం ఇప్పుడు షాంపూలో కొన్ని రకాల పదార్ధాలను కలిపి వాడటం ఎలాగో తెలుసుకుందాం. ఇలా వాడటం వలన జుట్టు రాలకుండా బలంగా ఉండటమే కాకుండా జుట్టు కాంతివంతంగా మారుతుంది. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
షాంపూలో కొంచెం రోజ్ వాటర్ కలిపి తల రుద్దుకుంటే తలలో దురద తగ్గుతుంది. రోజ్ water లో ఉండే గుణాలు తల మీద దురదను తగ్గిస్తాయి. దురద ఉంటే చుండ్రు సమస్య వస్తుంది. చుండ్రు సమస్య ఉన్నప్పుడు జుట్టు రాలే సమస్య కూడా ప్రారంభం అవుతుంది.
షాంపూలో కొంచెం నిమ్మరసం వేసుకొని తల రుద్దుకుంటే జుట్టు కాంతివంతంగా మెరుస్తుంది. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి మరియు యాంటి ఆక్సిడెంట్ లక్షణాలు తల మీద దుమ్ము,ధూళి వంటి వాటిని తొలగించి జుట్టు కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.
షాంపూలో తేనే కలిపి తల రుద్దుకుంటే జుట్టుకు మంచి పోషణ,తేమ అంది జుట్టు నిగనిగలాడుతూ మెరుస్తుంది.
షాంపూలో ఏదైనా అరోమా నూనెను కలిపి తల రుద్దుకుంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
షాంపూలో కలబంద కలిపి తల రుద్దుకుంటే తలలో చుండ్రు సమస్య సులభంగా తొలగిపోతుంది. కలబంద జుట్టుకి సంబందించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. కలబంద జుట్టు పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది. జుట్టు పొడిగా మారితే చుండ్రు సమస్య మరియు జుట్టు రాలే సమస్య వస్తాయి. అయితే కలబంద జెల్ మార్కెట్ లో లభ్యం అవుతుంది. కానీ సాధ్యమైనంత వరకు మన ఇంటిలో ఉన్న కలబంద మొక్క నుండి తీసుకున్న జెల్ వాడితే మంచిది.
షాంపూలో ఉసిరి రసం కలిపి తలస్నానం చేస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఉసిరి కూడా జుట్టు సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తుందిఉసిరి పొడి లేదా ఉసిరి పప్పు మార్కెట్ లో దొరుకుతుంది. దానిని కూడా వాడవచ్చు. లేదంటే సీజన్ లో ఉసిరి కాయలు ఉన్నప్పుడు బాగా ఎండబెట్టి పొడిగా చేసుకొని నిల్వ చేసుకోవచ్చు.
షాంపూలో అమృతబలి రసం, బృంగరాజ్ ఆకుల రసంతో కలిపి తలను రుద్దుకుంటే జుట్టు రాలకుండా ఉండటమే కాకుండా తెల్లజుట్టు సమస్య కూడా ఉండదు.
షాంపూలో వేప రసం కలిపి తలస్నానం చేస్తే చుండ్రు సమస్య ఉండదు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News