Beauty Tips

White Hair:బాదం నూనెలో కలిపి రాస్తే తెల్లజుట్టు 10 నిమిషాల్లో సూపర్ డార్క్ గా మారుతుంది

White Hair home Remedies in telugu :తెల్లజుట్టు సమస్య వచ్చినప్పుడు అసలు కంగారు పడవలసిన అవసరం లేదు.
తెల్లజుట్టు సమస్యతో ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది బాధపడుతున్నారు. తెల్లజుట్టు సమస్య రాగానే అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.

అదే మార్కెట్ లో దొరికే ఉత్పత్తులను వాడితే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి. అప్పుడే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

ఒక బౌల్ లో 5 స్పూన్ల బాదం నూనె,2 స్పూన్ల ఉసిరి రసం, ఒక స్పూన్ నిమ్మ రసం వేసి బాగా కలిపి జుట్టుకి పట్టించి గంట అయ్యాక తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి పలితం కనపడుతుంది.

ఈ రేమిడిలో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు తెల్లజుట్టును నల్లగా మార్చటమే కాకుండా జుట్టు కుడుళ్ళను బలంగా మార్చి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.

ఉసిరిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉండుట వలన జుట్టు సమస్యలకు చెక్ పెట్టటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఉసిరి తెల్లజుట్టును నల్లగా మార్చటమే కాకుండా జుట్టు ఫాలికల్స్ ని బలంగా మార్చి జుట్టు హెల్దీగా, పొడవుగా పెరిగేలా చేస్తుంది. ఇలా చేయడం వల్ల జుట్టు ఊడడం తగ్గుతుంది.

ఉసిరిలో విటమిన్ సితో పాటు మినరల్స్, అమైనో యాసిడ్స్, న్యూట్రియెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన జుట్టుకి బలాన్ని అందిస్తాయి. ఉసిరి వాడడం వల్ల స్కాల్ప్‌కి మాయిశ్చరైజేషన్ ఉండి చుండ్రు సమస్య కూడా తొలగిపోతుంది.

పోషకాల లోపం, ఒత్తిడి, నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల జుట్టు రంగు మారి జుట్టు నిర్జీవంగా మారుతుంది. అందుకే విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఉసిరిని వాడడం వల్ల జుట్టు రంగు అలానే అందంగా ఉంటుంది.

నిమ్మలోని గుణాలు జుట్టు కదుళ్ల వద్ద రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తాయి. నిమ్మలో విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించి జూతు పెరుగుదలకు సహాయపడుతుంది. నిమ్మకాయలోని యాంటీ ఫంగల్ లక్షణాలు జుట్టు ఆరోగ్యంగా పెరగటానికి సహాయపడుతుంది. తలలో pH బ్యాలెన్స్‌ని పునరుద్ధరిస్తుంది.

స్కాల్ప్ యొక్క సెబమ్ స్థాయిని సమతుల్యం చేయడం ద్వారా చుండ్రును నివారిస్తుంది. అంతేకాక జుట్టు జిడ్డుగా లేదా పొడిగా మారకుండా చేస్తుంది. అందుకే జుట్టుకి సంబందించిన ఉత్పత్తులలో నిమ్మ రసంను ఉపయోగిస్తున్నారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. కాబట్టి జుట్టుకి సంబందించిన సమస్యలు వచ్చినప్పుడు అసలు కంగారు పడకుండా ఇంటి చిట్కాలను ఫాలో అవ్వవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చుండ్రు,జుట్టు రాలే సమస్య,తెల్లజుట్టు సమస్యకు చెక్ పెట్టవచ్చు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u