Hair Tips:సహజంగా జుట్టును పెంచే ఆకులు ..10 రోజుల్లో ఊడిన చోట కొత్త జుట్టు వస్తుంది
curry leaves Hair Fall Tips:జుట్టుకి సంబందించిన సమస్యలు వచ్చినప్పుడు అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి.
జుట్టు రాలటం ప్రారంభం అయిందా.. కరివేపాకుతో ఇలా చేస్తే సరి.. జుట్టు పొడవుగా ఒత్తుగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దాని కోసం పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి.
నల్లని కళ్ళు, అందమైన గుండ్రని ముఖం మరియు పొడవాటి జుట్టు ఉంటే చాలా అందంగా కనిపిస్తారు. అయితే ఈ మధ్య కాలంలో జుట్టుకి సంబందించిన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి.
ఆ సమస్యలను తగ్గించుకోవటానికి ఒక నూనె తయారుచేసుకొని వాడితే జుట్టు రాలే సమస్య,చుండ్రు సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది. ఈ నూనె తయారి కోసం ఉపయోగించే అన్ని ఇంగ్రిడియన్స్ మనకు సులభంగా అందుబాటులో ఉంటాయి.
మూడు ఉల్లిపాయలను శుభ్రంగా కడిగి తొక్కతో సహా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. మిక్సీ జార్ లో ఉల్లిపాయ ముక్కలు, గుప్పెడు కరివేపాకు వేసి కొంచెం నీటిని చేర్చి మెత్తని పేస్ట్ గా చేసి పక్కన పెట్టాలి.
పొయ్యి మీద పాన్ పెట్టి 200 ml కొబ్బరి నూనె పోసి కొంచెం వేడి అయ్యాక ఉల్లిపాయ మిశ్రమం వేసి పావుగంట సేపు మరిగిస్తే నూనె నల్లగా మారుతుంది. ఆ తర్వాత ఈ నూనెను వడకట్టి సీసాలో పోసి నిల్వ చేసుకోవాలి.
ఈ నూనెను వారం రోజుల పాటు జుట్టుకి రాస్తే మంచి పలితాన్ని పొందవచ్చు. ఉల్లిపాయలో ఉండే లక్షణాలు రక్త ప్రసరణకు సహాయపడతాయి. ఈ నూనె చుండ్రు సమస్య నుండి బయటపడటానికి కూడా ఉపయోగపడుతుంది . దీన్ని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల స్కాల్ప్ శుభ్రంగా మారుతుంది.
యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండుట వలన జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ నూనె జుట్టుకి సంబందించిన సమస్యలను తగ్గించటానికి సహాయపడుతుంది.
ఈ రేమిడిలో తీసుకున్న ఉల్లిపాయ,కరివేపాకు,కొబ్బరి నూనెలో ఉన్న పోషకాలు జుట్టుకి సంబంధించిన సమస్యలు జుట్టు రాలుట,తెల్ల జుట్టు సమస్య, చుండ్రు సమస్య ఇలా జుట్టుకి సంబంచిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
కరివేపాకులో ఉన్న బీటా కెరోటిన్ జుట్టు కుడుళ్ళను బలోపేతం చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది. ఈ చిట్కాతో ప్రారంభ దశలో ఉన్న తెల్లజుట్టును నల్లగా మార్చటంలో కూడా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. కొబ్బరి నూనెలో ఉన్న పోషకాలు జుట్టు కాంతివంతంగా మెరవటానికి సహాయపడతాయి.
కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. చాలా తక్కువ ఖర్చులో మంచి పలితాన్ని పొందవచ్చు. ఉల్లిలో ఉన్న సల్ఫర్ జుట్టు రాలకుండా కాపాడి జుట్టు పెరిగేలా జుట్టు కుడుళ్ళను ప్రోత్సహిస్తుంది.
అలాగే వేప ఆకులు,బృంగ్రాజ్,తులసి,మందార వంటివి కూడా జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి ఈ చిట్కాలను ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ