అల్లు అర్జున్ తన భార్య క్యాస్ట్ గురించి ఇలా అనేశాడేంటి..?
నా పేరు సూర్య సక్సెస్ రేంజ్ గురించిన చర్చ పక్కన పెట్టి చూస్తే కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన అల్లు అర్జున్ తన పాత్రకు వచ్చిన స్పందన పట్ల హ్యాపీగానే ఉన్నాడు. ప్రమోషన్ విషయంలో కూడా చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న బన్నీ దీనికి సంబంధించిన ఇంటర్వ్యూలలో తన పర్సనల్ విషయాలు కూడా చాలానే షేర్ చేసుకున్నాడు. ముఖ్యంగా తన పెళ్లి గురించి ఓపెన్ అయిన బన్నీ తను వేరే కాస్ట్ అని అమ్మానాన్నకు ముందే చెప్పానని దానికి వాళ్ళు పూర్తిగా అంగీకరించాకే మూడు ముళ్ళు వేశానని ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాడు. మేము చూసే అమ్మాయి అయినా లేక నువ్వే ఎంచుకున్న కోడలైనా తమకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పడం వల్లే తన ప్రేమ కథ పెళ్లి దాకా వెళ్లిందని చెప్పాడు.
అమ్మ ఆలోచనలు మోడర్న్ గా ఉంటాయని పిల్లలకు ఏం కావాలో ఏది సరైనదో అలోచించి నిర్ణయం తీసుకుంటారని తన ప్రోత్సాహం వల్లే కల నిజమయ్యిందని చెప్పుకొచ్చాడు.కులాంతర వివాహాల విషయంలో సొసైటీ ఆలోచనలో ఇంకా మార్పు రావాల్సి ఉందంటున్న బన్నీ కొందరు నిన్నటి తరం వాళ్ళు దీనిని ఆహ్వానిస్తూ ఉండగా కొందరు కొత్త తరం లో ఉన్న వాళ్ళు కులం లెక్కలు వేసుకోవడం కూడా ఉందని చెప్పాడు.
ఇది జనరేషన్ కు సంబంధించింది కాదు అని క్లారిటీ ఇచ్చేసాడు. తన భార్య రెడ్డి క్యాస్ట్ అని చెప్పినప్పుడు అమ్మానాన్న చాలా కూల్ గా తన సెలక్షన్ కి ప్రాధాన్యత ఇవ్వడాన్ని గుర్తు చేసాడు. స్నేహ ఇంట్లోకి అడుగు పెట్టాక ఇప్పటి దాకా అత్త కోడళ్ళ మధ్య ఒక్క చిన్న అపార్థం కూడా లేదని బహుశా తాము ఆనందంగా ఉండడానికి ఆ ఇద్దరు అలా కలిసిపోవడమే కారణమేమో అని చెప్పాడు.
ఇప్పటికీ తల్లితండ్రులతోనే కలిసి ఉన్న బన్నీ జంట భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగుతామని చెబుతున్నారు. నా పేరు సూర్య తర్వాత తాను ఏ సినిమా చేయబోయేది అల్లు అర్జున్ నేరుగా బయట పెట్టడం లేదు. విక్రం కుమార్ తో ఉండొచ్చు అని వార్తలు వస్తున్నాయి ఇంకా అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది.