Vankaya Pakodi:కేటరింగ్ వారి వంకాయ పకోడీ సీక్రెట్స్.. రుచి అదిరిపోతుంది..
Vankaya Pakodi: ఎప్పుడూ ఒకేలా పకోడీ చేసుకునే బదులు ఓసారి కొత్తగా వంకాయ పకోడీ ట్రై చేయండి. వంకాయ కూరను తినని వారు వంకాయలను పకోడీల రూపంలో తినవచ్చు. దీని రెసిపీ ఎలాగో తెలుసుకోండి.కరకరలాడే ఉల్లి పకోడి, పాలకూరతో మెత్తని పకోడి, బెండకాయ పకోడి,అన్ని కురగాయలతో పకోడి చేసేస్తుంటాం. ఈసారి వంకాయతో ట్రై చేసేయండి.
కావాల్సిన పదార్ధాలు
వంకాయ కోటింగ్ కోసం..
ఉల్లిపాయ చీలికలు – 1కప్పు
ఉప్పు – కొద్దిగా
పసుపు – ¼ టేబుల్ స్పూన్
జీలకర్ర పొడి – 1/4టేబుల్ స్పూన్
కారం – 1 టేబుల్ స్పూన్
ధనియాల పొడి – 1 టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
వంకాయ ముక్కలు – 1/2kg
శనగపిండి – 1.5 కప్పు
మైదా పిండి – 1/4కప్పు
కార్న్ ఫ్లోర్ – 1/4కప్పు
నీళ్లు – 1/4కప్పు
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
పల్లీలు – 1/4కప్పు
పకోడి టాసింగ్ కోసం..
నూనె – 2 టేబుల్ స్పూన్స్
వెల్లుల్లి -7
పచ్చిమిర్చి -4
కరివేపాకు -2 రెమ్మలు
ఉల్లిపాయ చీలికలు – 1
పచ్చి కొబ్బరి -1/2కప్పు
గరం మసాలా -1 టేబుల్ స్పూన్
కారం – 1 టేబుల్ స్పూన్
కొత్తిమీర – 1/4కప్పు
ఆమ్ చూర్ పొడి – 1 టేబుల్ స్పూన్
తయరీ విధానం
1.ఒక గిన్నెలో ఉల్లిపాయలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి,గట్టిగా పిండుతూ కలపాలి.
2.అందులోకి వంకాయ ముక్కలు వేసి, తర్వాత శనగపిండి, మైదా పిండి, కార్న్ ఫ్లోర్ వేసి, ముక్కలకు పట్టేలా టాస్ చేసుకోవాలి.
3.వంకాయ ముక్కలకు పొడి పిండి పట్టిన తర్వాత కొద్ది కొద్దిగా , కోట్ చేసుకోవాలి.
4. మరిగే నూనెలో, వంకాయలు వేసి, మీడియం ఫ్లేమ్ పై, పకోడిని, కరరకలాడే టట్టు వేపుకుని, జల్లెడలో వేసుకోవాలి.
5.పకోడి వేపుకున్న తర్వాత, జీడిపప్పు, పల్లీలు, నూనెలో వేపి, తీసుకోవాలి.
6.ఇప్పుడు వెడల్పాటి, కడాయిలో ,నూనె వేడి చేసి, అందులోకి, వెల్లుల్లి,పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, ఒకదాని తర్వాత మరొకటి వేసి వేపుకోవాలి.
7. వేగిన తాళింపులో, వంకాయ పకోడి, మిగిలిన పదార్ధాలు అన్ని వేసి, హై ఫ్లేమ్ పై టాస్ చేసుకోవాలి.
8.సెర్వ్ చేసే ముందు, కొద్దిగా ఆమ్ చూర్ పౌడర్ చల్లుకుని, సెర్వ్ చేసుకోవాలి.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ