Ragi Munagaaku Roti:రాగి మునగాకు రొట్టె.. షుగర్ ఉన్నవాళ్లకు మంచి అల్పాహారం..
Ragi Munagaaku Roti:ఆరోగ్యం పై శ్రద్ద ఉన్న వాల్లు ముందుగా ఆహారం పై శ్రద్ద వహించాలి.మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది.ఎన్నో పోషక విలువలున్న రాగి,మునగాకు తో రొట్టెలు ఎలా చేయాలో చూసేయండి.
కావాల్సిన పదార్ధాలు
రాగి పిండి – 2 కప్పులు
మునగాకు – 1 కప్పు
ఉల్లిపాయ తరుగు – ½ కప్పు
ఎండుమిర్చి – 3-4
ఉప్పు – తగినంత
పచ్చి కొబ్బరి తురుము – ¼ కప్పు
వెల్లుల్లి – 1 టేబుల్ స్పూన్
వేడినీళ్లు – తగినన్ని
నూనె – రొట్టె కాల్చుకోవడానికి సరిపడా
తయారీ విధానం
1.ఒక గిన్నెలోకి రాగిపిండి వేసుకోని పదార్ధాలన్ని వేసి వేడి నీళ్లతో పిండిని మెత్తగా కలుపుకోవాలి.
2.చేత్తో మునగాకు,ఉల్లి పిండిలో నలిగేలా గట్టిగా వత్తూతు కలుపుకోవాలి.
3.రొట్టెల పీట పైన తడిక్లాత్ వేసి పిండి ముద్దను తీసుకోని చేతికి నూనె రాసుకోని నెమ్మదిగా రొట్టెను వత్తుకోవాలి.
4.వత్తుకున్న రాగి రొట్టెను క్లాత్ తో పాటుగా ప్యాన్ పై వేసి నెమ్మదిగా క్లాత్ ను తీసివేయాలి.
5.స్టవ్ మీడియం ఫ్లెమ్ పై ఉంచి రెండు వైపులా అంచులకు నూనె వేసి ఎర్రగా కాల్చుకోవాలి.
6.నూనె పూసిన ఈ రొట్టెలు చాలా టైం వరకు మెత్తగా గట్టిపడకుండా ఉంటాయి.
Click Here To Follow Chaipakodi On Google News