Silver cleaning tips:వెండి వస్తువులు నల్లగా మారాయా? – ఇలా చేస్తే ధగధగా మెరిసిపోతాయి!
Silver cleaning tips: వెండి వస్తువులు నల్లగా మారాయా? – ఇలా చేస్తే ధగధగా మెరిసిపోతాయి..వెండి వస్తువులను ప్రతి రోజు వాడినప్పుడు వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధను తప్పనిసరిగా పెట్టాలి. అప్పుడే అవి కొత్తవాటిలా మెరుస్తాయి. వెండి వస్తువులను ప్రతి రోజు వాడుతూ ఉంటే నల్లగా మారుతూ ఉంటాయి. నల్లగా మారిన వెండి వస్తువులను శుభ్రం చేయడం కొంచెం కష్టమైన పని.
అయితే ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటిస్తే చాలా సులభంగా నల్లగా మారిన వెండి వస్తువులను తెల్లగా మెరిసేలా చేయొచ్చు. వానలు వస్తున్నప్పుడు వెండి వస్తువులు చాలా తొందరగా నల్లగా మారిపోతూ ఉంటాయి.
ఎందుకంటే గాలిలో తేమశాతం ఎక్కువగా ఉంటుంది. గాలిలో ఉన్న తేమతో జరిగే రసాయనిక చర్య కారణంగా వెండి నల్లగా మారుతుంది. వెండి వస్తువులను సాధ్యమైనంతవరకు గాలి, తేమ తగలని ప్రదేశంలో దాచి పెట్టాలి. అలాగే ఇప్పుడు చెప్పే చిట్కాలు ఫాలో అయితే చాలా సులభంగా వెండి వస్తువులు మెరిసేలా చేసుకోవచ్చు.
ఒక గిన్నెలో రెండు కప్పుల వేడి నీటిని తీసుకోవాలి. దానిలో కొంచెం డిటర్జెంట్ పౌడర్ కలపాలి. ఆ తర్వాత మనం శుభ్రం చేయాలనుకున్న వెండి వస్తువులను దానిలో వేసి అరగంట అలా వదిలేయాలి. ఆ తర్వాత మెత్తని బ్రష్ సాయంతో సున్నితంగా శుభ్రం చేయాలి. ఇలా శుభ్రమైన వెండి వస్తువులను మెత్తని వస్త్రంతో తడి లేకుండా తుడవాలి.
ఉప్పు కూడా వెండి వస్తువులను తెల్లగా మెరిసేలా చేస్తుంది. వెండి వస్తువులను ఉప్పు నీటిలో కాసేపు ఉంచి ఆ తర్వాత బ్రష్ సహాయంతో శుభ్రంగా తుడిస్తే తెల్లగా మెరుస్తాయి.
టూత్ పేస్ట్ లో ఉండే క్యాల్షియం వెండి వస్తువులు మెరిసేలా చేస్తుంది. టూత్ పేస్ట్ తీసుకుని వెండి వస్తువుకు బాగా పల్చని పొరలా పూయాలి. టూత్ పేస్ట్ పూర్తిగా ఆరిపోయాక టిష్యూ పేపర్ తో శుభ్రంగా తుడిచి నీటితో కడిగితే సరిపోతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
Click Here To Follow Chaipakodi On Google News