Beauty Tips

Hair Care Tips:జుట్టు పలచబడుతోందా? ఇంట్లోనే ఇలా హెయిర్ కేర్ తీసుకోండి

Best Offer;ఆఫీస్,కాలేజ్,పండగ,పార్టీ వేర్.. ఇలా అన్నింటికీ సెట్ అయ్యే…

Coconut Hair Fall Tips:జుట్టుకి సంబందించిన ఏ సమస్యలు వచ్చినా ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. అయితే కాస్త ఓపికగా వీటిని పాటించాలి. ఎటువంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా సమస్యల నుండి బయట పడవచ్చు.

ఈ మధ్య కాలంలో మారిన పరిస్థితుల కారణంగా జుట్టు రాలే సమస్య, జుట్టు చివర్లు చిట్లటం వంటి సమస్యలకు మన ఇంటిలోనే మంచి పరిష్కారం చూడవచ్చు. ఎందుకంటే మన వంటింటిలో ఉండే కొన్ని సహజసిద్దమైన పదార్ధాలతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా తక్కువ సమయంలోనే సమస్య నుండి బయట పడవచ్చు.

మిక్సీ జార్ లో కడిగి శుభ్రం చేసిన ఒక కప్పు పుదీనా ఆకులు, మూడు ఉసిరికాయల ముక్కలు,అంగుళం కలబంద ఆకును ముక్కలుగా కట్ చేసి వేసి మిక్సీ చేసి ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఈ మిశ్రమంలో ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్ నిమ్మరసం, రెండు స్పూన్ల కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించి 2 గంటలు అలా వదిలేయాలి.

ఆ తర్వాత కుంకుడు కాయలు లేదా రెగ్యులర్ గా వాడే షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా, స్మూత్ అండ్ సిల్కీ గా ఉంటుంది. ఇంటి చిట్కాలను కాస్త ఓపికగా చేసుకుంటే చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. కాబట్టి ఈ ప్యాక్ ని ట్రై చేయండి.

ఉసిరి కాయలు దొరక్కపోతే ఎండిన ఉసిరిముక్కలు మార్కెట్ లో లభ్యం అవుతాయి. వాటిని నీటిలో నానబెట్టి వాడవచ్చు. లేదా ఉసిరి పొడిని కూడా వాడవచ్చు. పుదీనాలో ఉన్న లక్షణాలు జుట్టుకి మంచి పోషణను అందిస్తాయి. ఉసిరిని పూర్వ కాలం నుండి జుట్టు సంరక్షణలో వాడుతున్నారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News