Kitchenvantalu

Steamed Rice Balls:బ్రేక్ ఫాస్ట్.. స్నాక్స్ కి కాని డిన్నర్ కి కాని ఇలా చేసి పెట్టండి

Steamed Rice Balls: వినాయక చవితికి స్పెషల్ గా చేసుకునే ఆవిరి కుడుములు చాలా టేస్టీగా ఉంటాయి.పండుగలకే కాకుండా..అప్పుడుప్పుడు పిల్లలకు స్నాక్స్ లా చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఆవిరి పై ఉడికిన కుడుములు కాబట్టి ఆరోగ్యానికి కూడ చాలా మంచిది.

కావాల్సిన పదార్ధాలు
రవ్వ – 1 కప్పు
శనగపప్పు  – 2 టేబుల్ స్పూన్స్
సాల్ట్ – ½ టీ స్పూన్
నూనె లేదా నెయ్యి – కొద్దిగా

తయారీ విధానం
1.ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లు తీసుకోని,అందులోకి సాల్ట్,శనగపప్పును  యాడ్ చేసుకోని స్టవ్ పై మరగనివ్వాలి.
2. మరుగుతున్న నీళ్లలో రవ్వను పోసి కలుపుతు దగ్గర పడనివ్వాలి.
3.దగ్గర పడుతున్న సమయంలో ప్యాన్ మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
4.ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టాక..పిండి ఇంకాస్త గట్టిపడుతుంది.
5.ప్యాన్ లోని పిండిని మరో గిన్నెలోకి వేసుకోని ,కొద్ది కొద్దిగా పిండితో చిన్న చిన్న కుడుములు తయారు చేసుకోవాలి.

6.ఇప్పుడు ఒక ప్లేట్ అడుగు భాగంలో నూనె రాసి చేసుకున్న కుడుములను ప్లేట్లో అమర్చుకోవాలి.
7.ఇప్పుడు స్టీమింగ్ కోసం బాండి అడుగున కొద్దిగా నీళ్లు పోసి దాని పై స్టాండ్ సాయంతో ప్లేట్ ని నీళ్ల పైన పెట్టుకోవాలి.
8.దాని పై మూత పెట్టుకోని పది నుంచి పన్నెండు నిమిషాలు ఉడికించాలి.
9.అంతే స్టవ్ ఆఫ్ చేసుకోని కుడుములు తీసి సర్వ్ చేసుకోవడమే.
Click Here To Follow Chaipakodi On Google News