Kitchenvantalu

Spicy Guava Juice:జామకాయ గురించి ఈ ఒక్క విషయం తెలిస్తే ఇప్పుడే జ్యూస్ చేసుకుంటారు

Spicy Guava Juice: ఆరోగ్యంగా ఉండాలంటే మన రోజువారి మెనులో పండ్లను తప్పనిసరిగా యాడ్ చేసుకోవాలి. లేదా జ్యూస్ లు తయారు చేసుకోవాలి. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కి బాగా ఉపయోగ పడే జామ జ్యూస్ ని స్పైసీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
జామ పండ్లు – 2
చక్కెర – 2 టేబుల్ స్పూన్స్
పుదీనా ఆకులు – 7-8
పింక్ సాల్ట్ – ¾ టేబుల్ స్పూన్స్
జీలకర్ర పొడి – 1 టీ స్పూన్
కారం – 1 టీ స్పూన్
ఐస్ క్యూబ్స్ – తగినన్ని

తయారీ విధానం
1.పండిన జామ పండ్లను ముక్కలుగా చేసి మిక్సి జార్ వేసుకోని అందులోకి పంచదార,పుదీనా ఆకులు,పింక్ సాల్ట్,జీలకర్ర,కారం,ఐస్ క్యూబ్స్ జోడించి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
2.విత్తనాలు రాకుండా జ్యూస్ ని వడగట్టుకోని గ్లాస్ లో ట్రాన్స్ ఫర్ చేసుకోండి.
3.అందులోకి ½ టీ స్పూన్ కారం,1/2 టీ స్పూన్ ఉప్పు,1/4 టీ స్పూన్ చాట్ మసాలా వేసి పైనా నిమ్మరసం పిండుకుంటే స్పైసీ గూవా జ్యూస్ రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News