Finger Millets Upma:రాగి ఉప్మా ఇలా చేస్తే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం
Finger Millets Upma: వారంలో రెండు మూడు రోజులైనా రుచికి కాకుండా,ఆరోగ్యానికి ఉపయోగ పడే ఆహారాలు తీసుకోవాలి. అందులోకి రాగిపిండి,కూరగాయలతో చేసుకుకే మిల్లెట్స్ ఉప్మాను యాడ్ చేసుకోండి.అల్పాహారం ఆరోగ్యకరంగా మారుతుంది.
కావాల్సిన పదార్ధాలు
ఫింగర్ మిల్లెట్స్ (రాగిపిండి) – ½ కప్పు
బొంబాయి రవ్వ – ½ కప్పు
ఉల్లిపాయ – 1
పచ్చిమిర్చి – 3
టమాటోలు – 2
క్యారెట్స్ – 1
బంగాళదుంపలు – 1
క్యాప్సికం – ¼ కప్పు
కరివేపాకు – 1 కప్పు
కొత్తిమీర – ½ కప్పు
బఠానీలు – ½ కప్పు
ఆవాలు – 1 టీ స్పూన్
జీలకర్ర – ½ టీ స్పూన్
జీడిపప్పు – కొద్దిగా
ఉప్పు – 1 ½ స్పూన్
బటర్ – కొద్దిగా
నూనె – తగినంత
తయారీ విధానం
1.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని బటర్,లేదా నెయ్యి ,నూనె వేసి వేడిచేసుకోవాలి.
2.అందులోకి ఆవాలు,జీలకర్ర ,జీడిపప్పులు వేసి వేపుకోవాలి.
3.వేగాక అందులోకి తరిగిన అల్లం ,ఉల్లిపాయలు,పచ్చిమిర్చి,కరివేపాకు వేసి వేగాక క్యారెట్,క్యాప్సికం,బఠానీలు వేసి బాగా వేపుకోవాలి.
4.మూతపెట్టుకోని ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి.
5.ఇప్పుడు అందులోకి బొంబాయి రవ్వ వేసి వేపుకోవాలి.
6.రవ్వ వేగాక, రాగిపిండిని వేసి మాడి పోకుండా వేపుకోవాలి.
7.అందులోకి ఉప్పు యాడ్ చేసి రెండు కప్పుల నీళ్లను యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.
8.లోఫ్లేమ్ పై ఉడికించాలి.
9.ఉడికిన ఉప్మాలోకి బటర్ వేసి,చివరగా కొత్తిమీర చల్లుకోని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
10.అంతే హెల్తీ అండ్ టేస్టీ మిల్లెట్స్ ఉప్మా రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News