Dum Capsicum Rice:కేవలం 15 నిమిషాల్లో టేస్టీ అండ్ హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ.. క్యాప్సికమ్ రైస్..
Dum Capsicum Rice: లంచ్ బాక్సో లోకి కర్రీస్ ప్లేస్ లో ఫ్రైడ్ రైస్,పలావ్ ,వెజిటెబుల్ రైస్ పర్ఫెక్ట్. కాస్తా డిఫరెంట్ గా క్యాప్సికం తో ధం రైస్ చేసేద్దాం.
కావాల్సిన పదార్ధాలు
క్యాప్సికం – 3
అన్నం – 2 కప్పులు
వెల్లుల్లి 5-6
ఉల్లిపాయ – 1
లవంగాలు – 3
దాల్చిన చెక్క – 2-3
పెప్పర్ కార్న్స్ – ¼ టీ స్పూన్
శనగపప్పు – 3 టేబుల్ స్పూన్స్
మెంతులు – 2 టేబుల్ స్పూన్స్
ఎండుమిర్చి – 2
జీలకర్ర – 1 స్పూన్
ఆవాలు – 1 టీ స్పూన్
పసుపు – ½ టీ స్పూన్
కరివేపాకు – ½ కప్పు
నూనె – 2 ½ టేబుల్ స్పూన్స్
ఉప్పు – తగినంత
తయారీ విధానం
1.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని నూనె వేడి చేసి లవంగాలు,దాల్చిన చెక్క ,పెప్పర్ కార్న్స్,శనగపప్పు వేసి వేపుకోవాలి.
2. మసాలాలు వేగాక మెంతులు,ఎండుమిర్చి,జీలకర్ర వేసి మరికాసేపు వేపుకోవాలి.
3.స్టవ్ ఆఫ్ చేసుకోని మసాలాలు చల్లారిన తర్వాత మిక్సి జార్ లో వేసుకోని మెత్తగా గ్రైండ్ చేసి పక్కనపెట్టుకోవాలి.
4.వేరే ప్యాన్ లో నూనే వేడి చేసి అందులోకి ఉల్లిపాయలు,వెల్లుల్లి రెబ్బలు వేసి వేపుకోవాలి.
5.వేగిన ఉల్లి పాయల్లోకి క్యాప్సికమ్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి.
6.అందులోకి పసుపు,ఉప్పు వేసి క్యాప్సి మెత్తబడే వరకు వేపుకోవాలి.
7.అందులోకి గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి.
8.చివరగా ఉడికించిన అన్నం వేసి బాగా మిక్సి చేసుకోవాలి.
9.ఇప్పుడు వేరోక ప్యాన్ నూనె వేడి చేసి ఆవాలు,కరివేపాకు వేసి అందులోకి కలుపుకున్న క్యాప్సికం రైస్ ని వేసుకోని,మూతపెట్టి ఆవిరి బయటికి పోకుండా ప్యాక్ చెయ్యాలి.అలా పదినిమిషాలు లో ఫ్లేమ్ పై పది నిమిషాలు ఉడకనివ్వాలి.
10. పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోని నిమ్మరసం చల్లుకోని సర్వ చేసుకోవడమే.
Click Here To Follow Chaipakodi On Google News