Weight loss: బరువు తగ్గడానికి తిండి మానేస్తున్నారా..? ఈ పప్పులు తింటే సులభంగా వెయిట్ లాస్ అవుతారు..!
Weight loss: అధిక బరువు సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది. అధిక బరువు కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి.బరువు పెరగటం అనేది తొందరగా జరిగిపోతుంది కానీ తగ్గాలంటే మాత్రం చాలా కష్టం. బరువు తగ్గటానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రయోజనం ఉండదు.
కఠినమైన వ్యాయామం చేసేస్తూ ఉంటారు.అయినా సరే బరువు తగ్గడం మాట అటుంచి విపరీతమైన నీరసం వస్తుంది. అలా కాకుండా మంచి పోషకాహారం తీసుకుంటూ వ్యాయామం యోగా వంటివి చేస్తూ ఇప్పుడు చెప్పే పప్పులను ఆహారంలో భాగంగా చేసుకుంటే అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు.
కందిపప్పు
కందిపప్పు లో ప్రోటీన్ ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. సాచురేటెడ్ ఫ్యాట్, కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటాయి. కందిపప్పులో ఉండే ప్రోటీన్ ఆరోగ్యానికి చాలా మంచిది ఫైబర్ శరీరంలో నుంచి బయటకు పంపటానికి సహాయపడుతుంది అలాగే కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంది తొందరగా ఆకలి వేయదు దాంతో మనం తీసుకునే ఆహారం కూడా తగ్గుతుంది. ఫైబర్ కారణంగా కడుపుబ్బరం వంటి సమస్యలు కూడా ఉండవు.
పెసరపప్పు
దీనిలో కూడా ఫైబర్ ప్రోటీన్ చాలా సమృద్ధిగా ఉంటుంది దీనిలో ఉండే ఫైబర్ అధిక బరువు సమస్యతో బాధపడేవారికి చాలా బాగా సహాయపడుతుంది ఈ పప్పు తిన్న తరువాత తొందరగా ఆకలి వేయదు.పెసరపప్పుతో పెసరట్టు వేసుకోవచ్చు
ఎర్ర కందిపప్పు
ఇది మసూర్ దాల్ పేరుతో సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఎర్ర కందిపప్పు లో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనిలో లో మన శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు ఉంటాయి.ఈ పప్పు తింటే చాలాసేపు కడుపు నిండిన భావన ఉంటుంది తొందరగా ఆకలి వేయదు. ఇందులో ఉండే ప్రోటీన్ విటమిన్ బి 1 ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ బరువు తగ్గడానికి సహాయపడుతాయి.
మినప్పప్పు
మినప్పప్పు పొట్టు మినప్పప్పు ఛాయ మినప్పప్పు రూపంలో లభ్యమవుతుంది. మినప్పప్పు ను మనం ఇడ్లీ దోశ లకు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం మినప్పప్పులో ఉన్న ఫైబర్ కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది మినప్పప్పుతో తయారు చేసిన ఆహారం తీసుకున్నాక జంక్ fud తినాలన్న కోరిక ను తగ్గిస్తుంది అలాగే ఆకలిని కూడా తగ్గిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News