Kitchenvantalu

Gummadikaya Pappu Charu:ఘుమ ఘుమ లాడే గుమ్మడికాయ పప్పు చారు తయారీ.. తింటే వదిలిపెట్టరు

Gummadikaya Pappu Charu: ఎన్ని కూరలతో తిన్నా పప్పు చారుతో తింటే ఆ మజానే వేరు. గుమ్మడికాయతో పప్పుచారు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
గుమ్మడి కాయ ముక్కలు – సరిపడా
కందిపప్పు – ½ కప్పు
ఉల్లిపాయలు – 2
టమాటోలు – 2
జీలకర్ర -1 టీ స్పూన్
మెంతులు – ¼ టీ స్పూన్
పసుపు – ¼ టీ స్పూన్
చింతపండు – 20 గ్రాములు
నూనె – 2 టేబుల్ స్పూన్
కారం – 1 టీ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
బెల్లం – 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి – 3-4
పచ్చికొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్
కొత్తిమీర తరుగు – కొద్దిగా
ఆవాలు – ½ టీ స్పూన్
ఎండుమిర్చి – 2
కరివేపాకు – 2 రెమ్మలు
వెల్లుల్లి తరుగు – 7

తయారీ విధానం
1.ముందుగా కంది పప్పు శుభ్రంగా కడిగి కుక్కర్ లో వేసి 2 కప్పుల నీళ్లు పోసి అందులోకి మెంతులు,జీలకర్ర,పసుపు వేసుకోని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి గ్యాస్ పూర్తిగా పోనివ్వాలి.
2.ఉడికిన పప్పును మెత్తగా మెదుపుకోవాలి.
3.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని 1 స్పూన్ ఆయిల్ వేసుకోని వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ తరుగు వేసి వేపుకోవాలి.
4.కట్ చేసుకున్న గుమ్మడి కాయ ముక్కలను వేసి కాసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి.
5.ఇప్పుడు అందులోకి క్యారేట్ ,టమాటలు వేసి బాగా మగ్గనివ్వాలి.

6.టమాటలు మగ్గిన తర్వాత అందులోకి కారం ,ఉప్పు,మెంతి పొడి వేసి బాగా కలుపుకోని బెల్లం కూడ యాడ్ చేసుకోవాలి.
7.అన్ని బాగా వేగాక అందులోకి చింతపండు గుజ్జును వేసి మరగనివ్వాలి.
8.మరుగుతున్న చింతపండు రసంలోకి మెదుపుకున్న పప్పును వేసి బాగా కలిపి పది నిమిషాలు మరగనివ్వాలి.
9.మరుగుతున్న సాంబార్ లో కొబ్బరి పొడి,కొత్తిమీర తరుగు వేసుకోని మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
10.ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని అందులో టేబుల్ స్పూన్ ఆయిల్ వేడిచేసి అందులోకి తాలింపులు ,కరివేపాకు,వెల్లుల్లి తరుగు వేసి వేగిన తాలింపును మరిగిన సాంబార్ ల కలుపుకోవాలి.
11.అంతే వేడి వేడి సాంబార్ రెడీ అయినట్టే.