Poornam Kudumulu:పూర్ణంతో కుడుములు ఇలా చేస్తే చాలా రుచిగా ఉంటాయి..
Poornam Kudumulu: ఆవిరి పై ఉడికించి చేసిన ఆహారం చాలా ఆరోగ్యకరం. వినాయక చవితికి తయారు చేసుకునే కుడుములు పూర్ణంతో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.
కావాల్సిన పదార్ధాలు
బియ్యం పిండి – 1 కప్పు
శగనపప్పు – ½ కప్పు
బెల్లం తురుము – ½ కప్పు
నెయ్యి – 1 టీ స్పూన్
ఉప్పు – ½ టీ స్పూన్
కొబ్బరి – 2 టేబుల్ స్పూన్స్
తయారీ విధానం
1.కప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టి పిండి చేసుకోవాలి.
2.కుక్కర్ లో రెండు కప్పుల నీళ్లు ½ కప్పు శనగపప్పు వేసి నాలుగు,ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
3. ఉడికిన శనగ పప్పును వడకట్టుకోని మెత్తాగా మాష్ చేసుకోవాలి.
4.అందులోకి బెల్లం వేసి ముద్దగా కలుపుకోని స్టవ్ ఆన్ చేసి సన్నని మంట పై పప్పు బెల్లం ముద్దను కలుపుతూ అందులోకి కొబ్బరి పొడిని ,యాలకుల పొడి కూడ యాడ్ చేసుకోని మెత్తటి ముద్దగా తయారు చేసుకోని పక్కన పెట్టుకోవాలి.
5.ఇప్పుడు వేరొక ప్యాన్ లో కప్పు నీళ్లు పోసి మరిగించి అందులోకి నెయ్యి,ఉప్పు వేసి లోఫ్లేమ్ పై మరగనివ్వాలి.
6.మరుగుతున్న నీటిలో 1 కప్పు బియ్యం పిండిని వేసి రెండు కప్పుల నీళ్లును యాడ్ చేసుకోవాలి.
7.దగ్గర పడ్డాక ముద్దలా కలుపుకోని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
8.ఇప్పుడు పూర్ణం ముద్దలను చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోని పక్కన పెట్టుకోవాలి.
9.ఉడికించిన బియ్యం పిండిని కొంచెం తీసుకోని పూరిల ప్రెస్ చేసుకోని అందులోకి పూర్ణం ముద్దను పెట్టుకోని బాల్ లా చుట్టాలి.
10.తయారు చేసుకున్న పూర్ణం కుడుములను అడుగున నీళ్లు పోసి ఇడ్లీ మాదిరిగా ఆవిరి పై పది నిమిషాలు లోఫ్లేమ్ పై ఉడికించుకోవాలి.
11.అంతే కమ్మని పూర్ణం కుడుములు తయారైనట్టే.