White Hair Turn Black:చిన్న ఏజ్ లోనే జుట్టుకు కలర్ వేసుకుంటున్నారా.. ఈ నేచురల్ పద్దతులతో నల్లగా మార్చేయండి!
White Hair Turn Black Home Remedies:జుట్టుకి సరైన పోషణ లేకపోవటం, వాతావరణంలో కాలుష్యం,మెలనిన్ తగ్గటం వంటి అనేక రకాల కారణాలతో జుట్టుకి సంబందించిన సమస్యలు ముఖ్యంగా తెల్లజుట్టు సమస్య ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా కనపడుతుంది.
తెల్లజుట్టు సమస్య రాగానే అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. తెల్లజుట్టు సమస్య ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తుంది. దాంతో చాలా కంగారు పడిపోయి మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.
అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్దంగా తయారుచేసుకున్న చిట్కాలను ఫాలో అయితే మంచి పలితాన్ని చాలా తొందరగా చాలా తక్కువ ఖర్చులో పొందవచ్చు. కాస్త ఓపికగా సమయాన్ని కేటాయిస్తే సరిపోయుంది. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి అరస్పూన్ మెంతులను వేయాలి. ఆ తర్వాత రెండు స్పూన్ల టీ పొడి వేసి 5 నుంచి 7 నిమిషాల వరకు మరిగించాలి.
మరిగిన ఈ డికాషన్ ని వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ లో ఒక స్పూన్ ఇండిగో పొడి, రెండు స్పూన్ల హెన్నా పొడి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత తయారి చేసి పెట్టుకున్న డికాషన్ వేసి బాగా కలిపి మూడు గంటల పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి రెండు గంటల తర్వాత తలస్నానం చేయాలి.
ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. తెల్లజుట్టు ఎక్కువగా ఉంటె ఎక్కువ వారాల సమయం పడుతుంది. అదే తెల్లజుట్టు తక్కువగా ఉంటే తక్కువ వారాల సమయం పడుతుంది. కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.