Healthhealth tips in telugu

Migraine : చలికాలంలోనే మైగ్రేన్‌ సమస్య ఎందుకు..? వదిలించుకోవడం ఎలా?

Migraine Headache:ఈ మధ్య కాలంలో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. సమస్యలను తగ్గించుకోవాలన్నా.. సమస్యలు రాకుండా ఉండాలన్నా తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బిజీ జీవనశైలిలో ఒత్తిడి ప్రశాంతత లేకపోవడం వంటి కారణాలతో చాలామంది మైగ్రేన్ తలనొప్పితో ఇబ్బంది పడుతున్నారు. మైగ్రేన్ తలనొప్పి అంటే కొంతమందికి తలకు ఒక సైడ్ వస్తుంది. కొంతమందికి రెండు వైపుల కూడా వస్తుంది.

తలనొప్పి వచ్చిందంటే విపరీతమైన నొప్పి ఉంటుంది. మైగ్రేన్ తలనొప్పి అనేది పురుషుల్లో కన్నా స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ తలనొప్పి వస్తే రెండు గంటల నుండి మూడు రోజుల వరకు ఉండవచ్చు. ఈ తలనొప్పికి చెక్ పెట్టాలి అంటే బెల్లం అద్భుతంగా సహాయపడుతుంది అని నిపుణులు అంటున్నారు.

గోరువెచ్చని ఆవుపాలలో బెల్లం కలుపుకుని తాగాలి. ఈ విధంగా తాగుతూ ఉంటే మైగ్రేన్ తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే మైగ్రేన్ తలనొప్పిని తగ్గించడంలో అల్లం కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది మైగ్రేన్ తలనొప్పి ఉన్నప్పుడు అల్లం రసంలో నిమ్మరసం కలిపి తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది.

మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు బెల్లం పాలు లేదా అల్లం నిమ్మరసం మిశ్రమం తీసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఈ చిట్కాలు పాటిస్తే కొంత ఉపశమనం కలుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.