White hair: తెల్లజుట్టుకు హెయిర్ డై అవసరం లేదు ఇంట్లో తయారు చేసిన ఈ నూనె చాలు..
White Hair turn Black:తెల్లజుట్టు సమస్య రాగానే మనలో చాలా మంది మార్కెట్ లో దొరికే హెయిర్ డై లు వాడేస్తూ ఉంటారు. అయితే వాటిని వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.
ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. కొబ్బరినూనె, సోంపు గింజల మిశ్రమం తెల్లజుట్టును నల్లగా మార్చటమే కాకుండా జుట్టుకి సంబందించిన సమస్యలను తగ్గిస్తుంది.
సోంపు గింజలను మెత్తని పొడిగా చేసుకోవాలి.పాన్ లో 100 గ్రాముల కొబ్బరి నూనెను పొయ్యి మీద పెట్టి ఒక స్పూన్ సోంపు పొడి వేసి సోంపు రంగు మారే వరకు మరిగించాలి.
ఈ నూనెను వడకట్టి జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి అరగంట అయ్యాక తలస్నానం చేయాల్. ఇలా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.
సోంపు నూనెలో యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు సమృద్దిగా ఉండుట వలన తెల్లజుట్టు నల్లగా మారటమే కాకుండా చుండ్రు,జుట్టు రాలే సమస్య కూడా తొలగిపోతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/