Kitchenvantalu

Aratikaya Bajji Recipe : సాయంత్రం స‌మ‌యంలో ఏం తినాలో తోచ‌డం లేదా.. వీటిని చేసుకుని తినండి.. రుచి అదిరిపోతుంది..

Aratikaya Bajji Recipe : సాయంత్రం స‌మ‌యంలో ఏం తినాలో తోచ‌డం లేదా.. వీటిని చేసుకుని తినండి.. రుచి అదిరిపోతుంది.. చల్ల చల్లని వాతవరణంలో వేడి వేడి బజ్జీలు తింటే ఆ మాజానే వేరు. ఎప్పుడు మిరపకాయ బజ్జీలు,ఉల్లిపాయ పకోడీలే కాకుండా కేరళ స్టైల్ అరటికాయ బజ్జీలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.

మ‌న‌కు కూర‌గా చేసుకుని తినేందుకు అనేక ర‌కాల కూర‌గాయ‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో కూర అర‌టి కాయ‌లు కూడా ఒక‌టి. సాధార‌ణంగా అయితే అర‌టి పండ్ల‌ను తింటారు. కానీ కూర అర‌టి కాయ‌ల‌తో కూర‌లు చేస్తుంటారు. వీటిని భిన్న ర‌కాలుగా వండుకోవచ్చు. అయితే అర‌టికాయ‌ల‌తో ఎంతో రుచిగా ఉండే బ‌జ్జీల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు.

వీటిని మ‌న‌కు బ‌య‌ట విక్ర‌యిస్తుంటారు. కానీ కాస్త శ్ర‌మిస్తే ఇంట్లోనే ఎంతో రుచిగా ఉండేలా వీటిని తయారు చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే అర‌టికాయ బ‌జ్జీల‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్ధాలు
అరటి కాయ- 1
శనగపిండి – 1 కప్పు
అజోవాన్ – ¼ టీ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
సోడా – చిటికెడు

తయారీ విధానం
1.ముందుగా అరటి కాయ తొక్క తీసి వేసి చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2.ఒక గిన్నెలో ఉప్పు,నీళ్లు కలిపి అరటికాయ ముక్కలను అందులో వేయాలి.
3.ఇప్పుడు మిక్సింగ్ బౌల్ లో శనగపిండి వేసుకోని అందులోకి ఉప్పు,అజోవాన్ ,సోడా వేసి నీళ్లు వేసుకుంటు బజ్జీ బ్యాటర్ ల కలుపుకోవాలి.
4.ఇప్పుడు కలుపుకున్న పిండిలో అరటికాయ ముక్కలను ముంచి పిండిని కోట్ చేసి వేడినూనెలో వేసుకోవాలి.
5.స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బజ్జీలను వేపుకోవాలి.
6.అంతే వేడి వేడి అరటికాయ బజ్జీలు తయారైనట్టే.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u