Hotel Style Red Chutney:ఇడ్లీ, దోసల్లోకి 5 నిమిషాల్లో హోటల్ స్టైల్ రెడ్ చట్నీ
Hotel Style Red Chutney: ఇడ్లీ,దోశ,ఉప్మా టిఫిన్ ఏదైనా చట్నీ కామన్ గా చేసుకోవాల్సిందే. రెగ్యులర్ గా పల్లీ,కొబ్బరి చట్నీ బోర్ కొడితే ఈజీగా చేసుకునే రాయలసీమ స్టైల్ రెడ్ చట్నీ చేసేయండి.
కావాల్సిన పదార్ధాలు
టమాటోలు – ½ కప్పు
ఉల్లిపాయలు – ½ కప్పు
ఎండుమిర్చి – 5-6
చింతపండు – 5 గ్రాములు
ఉప్పు – రుచికి సరిపడా
తాలింపు గింజలు – తగినన్ని
తయారీ విధానం
1.మిక్సి జార్ లోకి ఉల్లిపాయలు,టమాటోలు,చింతపండు ,ఉప్పు వేసి పేస్ట్ ల గ్రైండ్ చేసుకోవాలి.
2.తాలింపు కోసం స్టవ్ పై కడాయి పెట్టుకోని ఆయిల్ వేడి చేసుకోవాలి.
3.వేడెక్కిన ఆయిల్ లో శనగ పప్పు,ఎండుమిర్చి ముక్కలు,జీలకర్ర ,ఆవాలు,పసుపు వేసి ఎర్రగా వేపుకోవాలి.
4.వేగిన తాలింపులో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎర్ర చట్నీని వేసి కలుపుకోవాలి.
5.అంతే చిటికెలో టిఫిన్ కోసం ఎర్ర చట్నీ రెడీ.