Instant Lemon Pickle:క్షణాల్లో తయారయ్యే నిమ్మకాయ పచ్చడి.. ఎంతో టేస్టీ కూడా..
Instant Lemon Pickle:నిమ్మకాయ కారం.. నిమ్మకాయ రసంతో ఉల్లాసంగా అనిపిస్తుంది. అదే నిమ్మకాయ పచ్చడి చూస్తే నోరు ఊరుతుంది. సీ విటమిన్ పుష్కలంగా లభించే నిమ్మకాయ కారం ఇన్ స్టెంట్ గా ఎలా ప్రీపేర్ చేసుకోవాలో చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు
నిమ్మ రసం – 2 లేదా 3 టేబుల్ స్పూన్స్
కారం – 2 స్పూన్స్
ఉప్పు – 1 1/2స్పూన్
ధనియాల పొడి – 1 స్పూన్
నువ్వుల పొడి – 1 టీ స్పూన్
జీలకర్ర- మెంతుల పొడి – 1/4స్పూన్
వెల్లుల్లి రెబ్బలు – 4 నుంచి 5
ఆవాలు – 1/2టీస్పూన్
జీలకర్ర – 1/2టీస్పూన్
కరివేపాకు – 1/2కప్పు
పసుపు – 1/2టీస్పూన్
తయారీ విధానం
1.రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం లోకి, కారం, ఉప్పు, ధనియాల పొడి, నువ్వుల పొడి, జీలకర్ర పొడి, వేసుకుని, మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి
2. తాళింపు కోసం, వెల్లుల్లి రెబ్బలను బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
3.స్టవ్ పై పాన్ పెట్టుకుని, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడి చేసి, అందులోకి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి తరుగు,కరివేపాకు, పసుపు, వేసి, బాగా వేవుకోవాలి.
4.స్టవ్ ఆఫ్ చేసి,వేగిన తాళింపులో మిక్స్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ మిశ్రమాన్ని, వేసి, మిక్స్ చేసుకుంటే,నిమ్మకాయ కారం రెడీ.