Hair Care Tips:మెంతులు, కొబ్బరి నూనె.. ఈ రెండు ఉంటే చాలు జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు
Fenugreek Seeds And Coconut Hair Fall:మెంతులు,కొబ్బరి నూనెను పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో వాడుతున్నారు. దీనిలో ఉన్న పోషకాలు జుట్ట్కి బలాన్ని అందిస్తాయి.
జుట్టు సంరక్షణలో మెంతులు, కొబ్బరి నూనెను వాడుతున్నారు. ఈ రెండింటిలో ఉన్న పోషకాలు జుట్టు కుడుళ్ళను బలోపేతం చేసి జుట్టు రాలకుండా చేస్తుంది.
ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి కారణంగా చుండ్రు, జుట్టు రాలే సమస్య వంటి ఎన్నో రకాల జుట్టుకి సంబందించిన సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలు రాగానే మనలో చాలా మంది కంగారు పడి మార్కెట్ లో దొరికే ఎన్నో రకాల ప్రొడక్ట్స్ వాడి వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు.
అయినా పలితం పెద్దగా కనపడదు. అలా కాకుండా మన వంటింటిలో ఉండే మెంతులను ఉపయోగించి జుట్టు సమస్యలను చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. మెంతులను ఇలా వాడితే చాలా తక్కువ ఖర్చులో సమస్యలను తగ్గించుకోవచ్చు. జుట్టుకు ఉన్న అన్ని రకాల సమస్యలకు పరిష్కారం చూపటానికి మెంతులు చాలా బాగా సహాయపడుతాయి.
మెంతులలో ఉన్న పోషకాలు చుండ్రు, పొడి జుట్టు, చివర్లు చిట్లిపోవడం వంటి ఎన్నో సమస్యలను తగ్గిస్తాయి. మెంతులలో ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. మూడు స్పూన్ల మెంతులలో మూడు స్పూన్ల కొబ్బరి నూనెను కలిపి మెత్తని పేస్ట్ గా చేసి జుట్టుకు బాగా పట్టించి రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంట తర్వాత తల స్నానం చేయాలి.
ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. కొబ్బరి పాలల్లో మెంతి పౌడర్ కలిపి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్టుని జుట్టుకు బాగా పట్టించి రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి పావుగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు నుంచి మూడుసార్లు చేస్తూ ఉంటే జుట్టు పొడిబారటం తగ్గి తేమగా ఉంటుంది.
జుట్టు పొడిగా మారి చుండ్రు సమస్య వచ్చేస్తుంది. చుండ్రు సమస్య ఉన్నప్పుడు కూడా ఈ ప్యాక్ చాలా బాగా సహాయపడుతుంది. మందార ఆకులు 5 తీసుకుని దానిలో నానబెట్టిన మెంతులు వేసి మెత్తని పేస్టులా చేయాలి ఈ పేస్ట్ ను జుట్టుకు పట్టించి అరగంటయ్యాక తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే జుట్టు పట్టుకుచ్చులా మృదువుగా ఉంటుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.