Healthhealth tips in telugu

Weight Loss Tips in Telugu : బరువు తగ్గాలా..? కుస్తీలు అవసరం లేదు.. రోజూ ఇలా చేస్తే చాలు!

Lemon For Weight Loss: అధిక బరువు సమస్య నుండి బయట పడాలంటే మన వంటింటిలో ఉండే కొన్ని వస్తువులను రెగ్యులర్ గా ఉపయోగిస్తే సరిపోతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా బరువు తగ్గవచ్చు.

ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. మారిన జీవనశైలి పరిస్థితులు, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, ఎక్కువసేపు కూర్చొని ఉండటం వంటి అనేక రకాల కారణాలతో అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.

అలాగే అధిక బరువు సమస్యతో బాధపడుతున్నప్పుడు ఇప్పుడు చెప్పే డ్రింక్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ డ్రింక్ తాగుతూ అరగంట వ్యాయామం లేదా యోగా చేస్తే చాలా తొందరగా మంచి ఫలితం కనబడుతుంది. ఈ డ్రింక్ ని ఎలా తయారుచేయాలి.. ఎప్పుడు తాగాలో తెలుసుకుందాం.

పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి గ్లాసున్నర నీటిని పోసి నీరు కాస్త వేడి అయ్యాక 15 తాజా పుదీనా ఆకులు, ఐదు లవంగాలు, అంగుళం దాల్చిన చెక్క ముక్క, అర స్పూన్ అల్లం తురుము, నాలుగు లేదా ఐదు నిమ్మకాయ ముక్కలు వేసి ఏడు నుంచి పది నిమిషాల పాటు మరిగిస్తే వాటిలో ఉన్న పోషకాలు అన్ని నీటిలోకి చేరతాయి.

ఆ తర్వాత ఆ నీటిని ఫిల్టర్ చేసుకోవాలి. ఈ డ్రింక్ గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం సమయంలో ఈ డ్రింక్ తీసుకుంటే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరుగుతుంది. ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలు, మలినాలు అన్ని తొలగిపోయి క్లీన్ గా మారుతుంది.

డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యల నుంచి ఉపశమనం కలిగి ప్రశాంతంగా ఉంటారు. ఈ డ్రింక్ లో ఉపయోగించిన అన్ని పదార్ధాలలో ఉన్న పోషకాలు మన శరీరానికి ఎన్నో రకాలుగా సహాయపడతాయి. కాస్త ఓపికగా చేసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా బరువు తగ్గవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.