Healthhealth tips in telugu

Sweet Potato Benefits: చిలగడ దుంపల్ని చలికాలంలో తినాలి.. ఎందుకంటే.. ఈ విషయాలు మీకోసమే!

Sweet Potato Benefits:చలికాలంలో వచ్చే సమస్యలు తగ్గాలన్నా.. రాకుండా ఉండాలన్నా.. ఆ సీజన్ లో వచ్చే కూరలను తప్పనిసరిగా తినాలి. అప్పుడే శరీరంలో రోగనిరోదక శక్తి పెరిగి సమస్యలు రాకుండా ఉంటాయి.

సీజన్ లో వచ్చే పండ్లు,కూరలను తింటూ ఉంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా ఈ సీజన్లో చిలకడ దుంపలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. చిలకడ దుంపలు చాలా రుచికరంగా ఉంటాయి. చిలకడ దుంపలను ఉడికించి తీసుకోవచ్చు లేదా కాల్చి తీసుకోవచ్చు. ఈ దుంపలు చాలా తియ్యగా ఉంటాయి. వీటిలో చాలా పోషకాలు ఉంటాయి.

చిలకడ దుంపలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, మంచి ఫ్యాట్, ఫైబర్, విటమిన్ A, C, మాంగనీస్, విటమిన్ B6, పొటాషియం, పాంటోథెనిక్ యాసిడ్, కాపర్ (రాగి), నియాసిన్ వంటివి సమృద్దిగా ఉంటాయి. దీనిలో బీటా కెరోటిన్ రూపంలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. బీటా-కెరోటిన్ మీ శరీరంలో విటమిన్ ఎగా మార్చబడుతుంది. కంటికి సంబందించిన సమస్యలు లేకుండా చేస్తుంది.

డైటరీ ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన పేగు ఆరోగ్యాన్ని మరియు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీనిలో ఫైటోస్టెరాల్‌ ఉండుట వలన జీర్ణవ్యవస్థకు సమస్యలు రాకుండా కాపాడుతుంది. గ్యాస్,కడుపు ఉబ్బరం,మలబద్దకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. చిలకడ దుంపలలో ఉండే ఫైబర్స్ మరియు యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి.

అధిక స్థాయిలో ఆంథోసైనిన్ ఉండుట వలన కరోనరీ వ్యాధి అవకాశాలను తగ్గించడంలో సహాయపడుతుందని ఇటీవల జరిగిన పరిశోదనల్లో తేలింది. అలాగే మెదడుకు ఎటువంటి సమస్యలు లేకుండా వయస్సు పెరిగే కొద్ది వచ్చే అల్జీమర్స్ వంటి సమస్యలు లేకుండా మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చిలకడదుంపలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ మరియు యాంటీఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన చర్మ సంరక్షణలో కూడా సహాయపడుతుంది. చిలకడ దుంప తిని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి. ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వారంలో మూడు సార్లు తింటే సరిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.